బీసీలపై కాంగ్రెస్ వివక్ష: ఆర్.కృష్ణయ్య | congress party discriminating BC people | Sakshi
Sakshi News home page

బీసీలపై కాంగ్రెస్ వివక్ష: ఆర్.కృష్ణయ్య

Published Mon, Mar 2 2015 5:06 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

బీసీలపై కాంగ్రెస్ వివక్ష: ఆర్.కృష్ణయ్య - Sakshi

బీసీలపై కాంగ్రెస్ వివక్ష: ఆర్.కృష్ణయ్య

సాక్షి, హైదరాబాద్: బీసీలపై కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఆ శాఖ తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఎన్నికలకు ముందు బీసీ ఓట్లకోసం పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షుడిని చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అగ్రకులాలకు ఆ పదవిని కట్టబెట్టాలనుకోవడం దారుణమని విమర్శించారు.

తెలంగాణ ఇచ్చినా ఆ పార్టీ రాష్ట్రంలో ఓడిపోవడానికి గతంలో అగ్ర కుల ముఖ్యమంత్రుల పాలనే కారణమని దుయ్యబట్టారు. బీసీ వర్గానికి చెందిన పొన్నాలను మార్చి ఇప్పుడు అగ్రకులాలకు ఆ పదవిని ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా తన వైఖరి మార్చుకోకపోతే ఆ పార్టీ బీసీలకు దూరం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement