సాక్షి, విజయవాడ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాహసోపేతమైన పాదయాత్ర చేశారని వైస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకూ వైఎస్ఆర్ చేపట్టిన ప్రజాప్రస్థానం ఓ ప్రభంజనం సృష్టించిందని, ఆతరువాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. 1476 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్‌ఆర్ వేల మందిని కలిశారని, అన్ని వర్గాల ప్రజల కష్టాలని స్వయంగా తెలుసుకున్నారని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిచించిన అనంతరం వాటిని పరిష్కరించారని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, విద్యార్థుల కోసం ఫీజ్ రీయింబర్స్‌మెంట్, 108, 104 వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టారని, కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించకపోతే.. ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టేవారని తెలిపారు.
గతంలో తొమ్మిదేళ్లలో చంద్రబాబు దారుణమైన పాలనను.. ఇప్పుడు నాలుగేళ్లుగా ప్రజలు చవిచూస్తున్నారని రాంబాబు విమర్శించారు. ఆరు వందల వాగ్ధానాలు చేసిన చంద్రబాబు, వాటిలో పది కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన బాబు, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన దౌర్భగ్యపు పరిస్థితిలో రాష్ట్రంలో ఉందని అన్నారు. దేశంలోనే చంద్రబాబు సమసర్థ పాలన చేసున్నారని, సీఎం అవినీతిని ఎండగట్టడం కోసమే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేపట్టారని వెల్లడించారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఉత్తరాంధ్ర చేరే సరికి మరో ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు. చంద్రబాబు దుష్టపాలనను ప్రజాసంకల్పయాత్ర అంతం చేస్తుందంటూ వ్యాఖ్యానించారు.
ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరి, ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోందని అంబటి అన్నారు. అప్పుడు వైఎస్‌ఆర్‌ను ఆదరించినట్లే ప్రజలు నేడు వైఎస్ జగన్‌ను ఆదరిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు ఉద్యమిస్తుంటే బాబు మాత్రం సింగపూర్ ఎందుకు వెళ్తున్నారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన అవినీతి, పాపాలపై ప్రధాని మోదీ ఏదైనా విచారణ వేస్తారమోనని ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు ఆమరణ దీక్షలు చేస్తుంటే... కనీసం పరామర్శించే సమయం చంద్రబాబుకు లేకుండా పోయిందా? అంటూ ప్రశ్నించారు. స్వలాభం కోసం రాష్ట్ర భవిష్యత్తును కేంద్రానికి తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు మోదీతో కలిసి రాష్ట్రంను నిలువునా ముంచారని రాంబాబు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment