
సాక్షి, హైదరాబాద్ : పార్టీ మారిన నేతలంతా నమ్మక ద్రోహులు అంటూ బాలకృష్ణ మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా మహాకూటమి తరుపున ప్రచారాన్ని నిర్వహిస్తున్న బాలకృష్ణ పై విధంగా స్పందించారు. వివేకానంద నగర్‌లో ఆదివారం నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ.. చంద్రబాబును వద్దను కుంటే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను తీసేయాలంటూ ఎద్దేవా చేశారు. హైటెక్ సిటీని, ఫ్లై ఓవర్లను మూసివేసే దమ్ముందా అంటూ సవాస్ విసిరారు. టీడీపీ గురించి కేసీఆర్ కాకమ్మ కబుర్లు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment