సాక్షిప్రతినిధి,సూర్యాపేట /కూసుమంచి: కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేటలో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌పై ఏళ్లుగా పోరాటం చేసి, అకస్మాత్తుగా ఆపార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోవా ల్సి వచ్చిందో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
చంద్రబాబు తీరుతో టీడీపీ అస్థిత్వాన్ని కోల్పోయిందని విమర్శించారు. ఏపీ లో ఐటీ దాడులు జరుగుతుంటే బాబుకు ఉలుకెందుకని, ఆ కంపెనీలతో బాబుకు ఏమైనా లా వాదేవీలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ప్రధానిని విమర్శించే నైతిక హక్కు బాబుకు లేదని అన్నారు. మహాకూటమి మాయా కూటమిగా మారిందని, కోదండరాం.. సిద్ధాంతాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌కు దాసోహమై టికెట్ల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడుతుం దని, ఇచ్చిన హామీలను నేరవేర్చలేని టీఆర్‌ఎస్ ఓటమి అంచుల్లోకి చేరుకుందని అన్నారు.
టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పండి
టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని దత్తాత్రేయ అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment