
దగ్గుబాటి పురంధేశ్వరి
బీజేపీయేతర కూటమికి ఒక లక్ష్యమంటూ లేదని, ప్రజల ఆశీస్సులతో బీజేపీ మళ్లీ అధికారంలోకి ..
కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోకి కాంగ్రెస్ పార్టీని రానివ్వమని చెప్పిన టీడీపీ నాయకులు అదే కాంగ్రెస్‌తో జత కట్టడం సిగ్గుచేటని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ..నవ్యాంధ్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ డిక్లరేషన్‌కు బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బీజేపీయేతర కూటమికి ఒక లక్ష్యమంటూ లేదని, ప్రజల ఆశీస్సులతో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.