బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల | BJP Leaders Assembly Candidates List Visakhapatnam | Sakshi
Sakshi News home page

బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల

Published Mon, Mar 18 2019 12:15 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

BJP Leaders Assembly Candidates List Visakhapatnam - Sakshi

జనార్ధనరావు విష్ణుకుమార్‌రాజు రవీందర్‌రెడ్డి అప్పారావు

పెదవాల్తేరు (విశాఖతూర్పు):వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈమేరకు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రకటించిన జాబితాలో జిల్లాకు సంబంధించిన అభ్యర్థులను ఆదివారం ప్రకటించారు. భీమిలి నియోజకవర్గం నుంచి మేడపాటి రవీందర్‌రెడ్డి, విశాఖ దక్షిణం నుంచి కాశీవిశ్వనాథరాజు, ఉత్తర నుంచి విష్ణుకుమార్‌రాజు, పశ్చిమ నుంచి బుద్ధ చంద్రశేఖర్, గాజువాక నుంచి పులుసు జనార్దనరావు, ఎస్టీలకు రిజర్వు చేసిన అరకు నుంచి కురసా ఉమామహేశ్వరరావు, పాడేరు నుంచి లోకుల గాంధీ పోటీచేస్తారు. ఇక అనకాపల్లి నుంచి పొన్నగంటి అప్పారావు, పెందుర్తి నుంచి కేవీవీ సత్యనారాయణ, యలమంచిలి నుంచి మైలపల్లి రాజారావు, పాయకరావుపేట నుంచి కాకర నూకరాజు, నర్సీపట్నం నుంచి గాదే శ్రీనివాస్‌ పోటీచేస్తారని ప్రకటించారు. జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా విశాఖపట్నం, అనకాపల్లి, అరకు పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement