గాంధీనగర్ : సర్వత్రా ఆసక్తి రేపిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. సాధారణ కౌంటింగ్ వివరాలు, ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్ వివరాల్లోనూ బీజేపీ దూసుకెళ్తోంది. రాణ్ ఆఫ్ కచ్, సౌరాష్ట్ర పాంత్రాల్లో కాంగ్రెస్ పాగా వేయగా.. దక్షిణ, మధ్య గుజరాత్‌లలో బీజేపీ హవా కొనసాగుతోంది.
ఎన్నికల కమిషన్ అధికారిక వివరాల ప్రకారం.. గుజరాత్‌లో బీజేపీ 101 చోట్ల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండగా.. కాంగ్రెస్ 74 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బీజేపీ 38 చోట్ల, కాంగ్రెస్ పార్టీ 22 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
సాధారణ కౌంటింగ్ వివరాల ప్రకారం.. బీజేపీ 105 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 74 చోట్ల ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో పోరు ఏకపక్షంగా సాగుతోంది. బీజేపీ 39 స్థానాల్లో, కాంగ్రెస్ 24 స్థానాల్లోనూ, ఇతరులు 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
- గుజరాత్‌లో 182 స్థానాలకు 1,828 మంది అభ్యర్థులు పోటీ
- ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 92 సీట్లు
- హిమాచల్‌లో 68 స్థానాలకు 337 మంది అభ్యర్థుల పోటీ
- ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 35 సీట్లు
Comments
Please login to add a commentAdd a comment