కన్‌ఫ్యూజన్‌లో కేటీఆర్‌ | KTR Gets Confused With Gujarat, Himachal elections Result | Sakshi
Sakshi News home page

కన్‌ఫ్యూజన్‌లో కేటీఆర్‌

Published Mon, Dec 18 2017 10:38 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

KTR Gets Confused With Gujarat, Himachal elections Result - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు తనను కన్‌ఫ్యూజన్‌కు గురి చేస్తున్నాయని తెలంగాణ మంత్రి కే తారకరామారావు ట్వీట్‌ చేశారు. న్యూస్‌ చానెళ్లు అన్నీ వేరు వేరు నెంబర్లను ప్రదర్శిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఏ ప్రాంతంలో ఎవరు ముందంజ లేదా వెనుకంజలో ఉన్నారో తనకు అసలు అర్థం కావడం లేదని చెప్పారు.

అభిప్రాయాలు తదితరాలను తాను అర్థం చేసుకోగలనని తెలిపారు. కానీ, నిజాలు, నెంబర్లు ఎలా మారుతాయని ప్రశ్నించారు. కాగా, కేటీఆర్‌ ట్వీట్‌పై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ఒకరు టీవీని స్విచాఫ్‌ చేయమని సలహా ఇస్తే.. అన్నింటికంటే బెటర్‌ ఈసీని ఫాలో అవ్వండి అటూ సూచన చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement