గుజరాత్‌లో బీజేపీ గెలిచి ఓడింది. కాంగ్రెస్ ఓడి గెలిచింది. ఇంతకీ ఎవరు గెలిచినట్లు? ఎవరు ఓడినట్లు? చెప్పలేం. పిల్లాడు ఫెయిల్ అయితే మోరల్‌గా తెలివి లేనట్లు కాదు. పాస్ అయితే ఓవరాల్‌గా తెలివి ఉన్నట్లు కాదు. అందుకే, గుజరాత్ ఫలితాలను బేస్‌గా తీసుకుని 2018 మార్చి నుండి పరీక్షల్లో ఫెయిల్ అయిన పిల్లల్ని ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ అని కాకుండా.. ‘మోరల్ విన్నర్స్’అనబోతున్నారు. వాళ్లకిచ్చే సర్టిఫికెట్‌లలో కూడా ఫెయిల్ అనే మాట ఉండదు. ఆ మాటకు బదులుగా ‘మోరల్ విన్నర్’ అనే మాట చేర్చాలని హెచ్.ఆర్.డి. మినిస్టర్ జవ్‌దేకర్ ప్రకాశ్ ఆలోచిస్తున్నారట!
ఈ వార్త తెలియగానే కాంగ్రెస్ పార్టీ కొత్త యువ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. గెలుపును గెలుపుగా, ఓటమిని ఓటమిగా చూడకపోవడం ఈ నాలుగేళ్ల పాలనలో బీజేపీ తొలి గెలుపు అని అన్నారు. రాహుల్ ఏం మాట్లాడినా, అతడికి వ్యతిరేకంగా ఏదో ఒకటి మాట్లాడే మోదీ మాత్రం ఈసారి మౌనంగా ఉండిపోయారు. ఇలా ఆయన మౌనంగా ఉండడం మోరల్‌గా విన్ అవడమా? డీమోరల్ అవడమా అనే అంశంపై దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment