
సాక్షి, తూర్పుగోదావరి : మామగారి కాళ్లమీద పడి తెలుగు దేశం పార్టీలో చేరిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు.. ఎన్‌టీ రామారావును పార్టీలోనుంచి, జీవితంలోనుంచి శాశ్వతంగా సమాధి చేశాడని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదన్నారు.
2019లో చంద్రబాబు రాజకీయాలనుంచి సమూలంగా బయటకు వెళ్లిపోతాడని జోష్యం చెప్పారు. చంద్రబాబు టక్కు, టమార విద్యలు నరేంద్ర మోదీ, అమిత్‌షాల ముందు పనిచేయలేదు కాబట్టే బయటకు వెళ్లిపోయాడని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment