సాక్షి, బెంగళూరు : ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టిందని, వారికి మంత్రి పదవులతో పాటు రూ.100 కోట్ల మేర ఆశ చూపినట్లుగా కాంగ్రెస్ టేపులు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవనగౌడ చన్నబసవనగౌడ పాటిల్ (బీసీ పాటిల్) స్పందించారు. బలపరీక్షలో బీజేపీకి ఓటేస్తే మంత్రి పదవితో మరెన్నో ఇస్తామని బీజేపీ తనకు ఆశ చూపింది నిజమేనని పేర్కొన్నారు. తనను సంప్రదించి మామూలు నేతలు కాదని, అందులో యడ్యూరప్ప కూడా ఉన్నారని చెప్పి బీజేపీని మరింత ఇరకాటంలోకి నెట్టారు. తమ పార్టీ ఎమ్మెల్యే శివరామ్ హెబ్బర్ గురించి తనకేమీ తెలియదన్నారు. కానీ, తన విషయం గురించి వెల్లడిస్తునన్న పాటిల్ ప్రలోభాలు నిజమనేనన్నారు.
బీజేపీ కీలక నేతలు యడ్యూరప్ప, శ్రీరాములు, మురళీధర్ రావు తనను సంప్రదించారని, తమకు ఓటేస్తే మంత్రి పదవి ఇస్తామని ప్రలోభాలకు గురి చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ బలపరీక్ష నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కాంగ్రెస్ నేతలు బీజేపీ ప్రలోభాల ఆడియో టేపులను విడుదల చేయడం తెలిసిందే. మరోవైపు జేడీఎస్ నేత కుమారస్వామి నేడు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్-జేడీఎస్ కేబినెట్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment