సాక్షి, గుంటూరు: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 12న గుంటూరు జిల్లాలో అడుగుపెట్టనుందని, ఆయనను అందరూ ఆశీర్వదించాలని వైఎస్‌ఆర్‌సీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడు విజయచందర్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది తెలుగువారు కృషి చేశారని, రాష్ట్రాన్ని విడగొట్టి జాతిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. స్వాతంత్ర్యాన్ని సాధించి మన పూర్వీకులు మనకు ఎంతో ఇచ్చారని, కానీ మనం రేపు మన పిల్లలకు ఏం ఇవ్వగలమని ఆయన ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రజలు అడుగడుగునా తమ కష్టాల్ని చెప్పుకుంటున్నారని, వారి కష్టాల్ని చూస్తుంటే బాధగా ఉందన్నారు. జగన్ అన్ని విషయాల్లో దూసుకుపోతున్నారని, ప్రత్యేక హోదా కోసం అన్ని విధాలా కృషిచేస్తామని విజయచందర్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం బూటకపు రాజీనామాలు కాకుండా, నిజాయితీగా రాజీనామాలు చేయాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment