
సాక్షి, హైదరాబాద్: ప్రజలను పాలించడానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడో లేక చంపడానికి అయ్యాడో అర్థం కావడంలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనాను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని, రాష్ట్రానికి ఇలాంటి సీఎం ఉండటం దురదృష్టకరమని విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పక్క రాష్ట్రం ఏపీని, ఢిల్లీ ప్రభుత్వాలను చూసి నేర్చుకోవాలని సూచించారు. ఏపీలో పది లక్షలకు పైగా టెస్టులు చేస్తే, తెలంగాణలో లక్ష మాత్రమే ఎందుకు జరిగాయని, ఇది కేసీఆర్ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు.