
ఉలవపాడు : తనకు స్కాలర్ షిప్ ఇవ్వకపోగా ఒరిజనల్ సర్టిఫికెట్లు కూడా కళాశాల యాజమాన్యం ఇవ్వడం లేదని అద్దంకికి చెందిన యు.ప్రతిభ జగన్‌ను కలిసి విన్నవించింది. అద్దంకిలోని రాయల్ కళాశాలలో తాను ఇంటర్ చదివానని 835 మార్కులు సాధించి ఎంసెట్‌లో అర్హత సాధించానని చెప్పింది. ఎస్సీ రిజర్వేషన్ ఉన్నా తనకు స్కాలర్‌షిప్ ఇవ్వలేదని.. ఫీజు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వలేదని వాపోయింది. అదేమని అడిగితే ట్రెజరీలో పెండింగ్ ఉందని అంటున్నారని చెప్పింది.
ఖర్చులొచ్చే పరిస్థితి లేదు
పర్చూరు: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాభావ పరిస్థితుల వల్ల ఎర్ర శనగ (జె.జె–11) ఎకరానికి గతంలో 10 క్వింటాళ్లు అయ్యేవి. ప్రస్తుతం 3 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి రావడం వల్ల ఖర్చులకు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని వెంకటాపురం గ్రామానికి చెందిన కె.మోహనరెడ్డి వైఎస్ జగన్ వద్ద వాపోయారు. గతంలో రూ.6 వేలు ఉన్న శనగల ధర ప్రస్తుతం రూ. 3,200 పడిపోవడంతో అటు అమ్ముకోలేక, అమ్మిన ఖర్చులకు సరిపోవన్న ఆలోచనలో రైతులు నానా అవస్థలు పడుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment