
సాక్షి, చింతలపల్లి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పోరాటంతోనే ప్రత్యేక హోదా సాధ్యమని యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అన్నారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు శనివారం చింతపల్లిలో సాగిన ప్రజాసంకల్పయాత్రలో జననేత వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలను కొనియాడారు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడిన నాయకుడు వైఎస్ జగన్ అన్నారు.
తాము బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నా.. ఏపీలో జరుగుతున్న రాజకీయాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో నాలుగు వందల సార్లు యూటర్న్ తీసుకున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సర్కార్ చేసుకున్న లక్ష ఎంఓయూల ఒప్పందాలకు సంబంధించిన ఒక్క పరిశ్రమైనా రాష్ట్రానికి వచ్చిందా అని నిలదీశారు. చంద్రబాబు నాలుగేళ్లలో ప్రచారం తప్ప.. సాధించినది ఏమీ లేదని టెకీలు ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment