‘ఆ ఘటనపై కేసీఆర్‌ స్పందించకపోవడం దారుణం’ | Congress Leader Komatireddy Venkat Reddy Slams KCR In Yadadri Bhuvanagiri District Over Hajipur Incident | Sakshi
Sakshi News home page

‘ఆ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం’

Published Sat, May 18 2019 7:24 PM | Last Updated on Sat, May 18 2019 7:33 PM

Congress Leader Komatireddy Venkat Reddy Slams KCR In Yadadri Bhuvanagiri District Over Hajipur Incident - Sakshi

కాంగ్రెస్‌ నేత కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి(పాత చిత్రం)

యాదాద్రి భువనగిరి జిల్లా: హాజీపూర్‌ ఘటన సభ్య సమాజం తలదించుకునే ఘటన అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..ఎక్కడో ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగితే అందరం స్పందించాం.. హాజీపూర్‌ దారుణంపై ఇక్కడి ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం శోచనీయమన్నారు. బాధితులు ఆమరణ నిరాహార దీక్షకు దిగినా సీఎం కేసీఆర్‌ మనసు కరగలేదని విమర్శించారు.

ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ తన మానవత్వాన్ని నిరూపించుకోవాలని సూచించారు. వెంటనే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి విచారణ కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. ఎన్నికల ఫలితాల తర్వాత బాధితులతో కలిసి ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement