
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనని సికింద్రబాద్ మహంకాళి అమ్మవారిపై ఒట్టు వేసుకొని ప్రజల్లోకి వెళ్దామని అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత ఒంటెరు ప్రతాప్ రెడ్డి సవాల్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇంటింటికి నల్లా ఇవ్వనిదే ఓటు అడగనన్న కేసీఆర్ ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఎన్నికలకు పోతున్నాడని విమర్శించారు. కేసీఆర్‌కు చీము నెత్తురు ఉంటే మాట మీద నిలబడి ఎన్నికలకు దూరంగా ఉండాలన్నారు. సాధారణ ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు.
తెలంగాణ వచ్చి ఉండకపోతే కేసీఆర్ గజ్వెల్‌లో ఎమ్మెల్యేగా కూడా గెలిచేవాడు కాదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు, అవినీతి మీద ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. 2001లో కేసీఆర్, హరీశ్‌రావుల ఆస్తులు ఎంతో.. ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంతో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బ్రోకరిజం పుట్టిందే కేసీఆర్ ఇంట్లోనని, ఆయన ఒక గల్ఫ్ ఏజెంట్ అని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతి బయటపెడతామని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment