
హైదరాబాద్: మండలి ఎన్నికల ముందు ఇద్దరు ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లోని తీసుకోవడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
‘పార్లీలు తిరిగే ఓపిక నాకు ఇంకా లేదు. నాకు కష్టాలున్నాయి. అయినా నన్ను ఎవరూ కొనలేరు. ఇటీవల కాలంలో నా ప్రెస్‌మీట్లు, చిట్‌చాట్లు కొంత గందరగోళానికి గురి చేశాయి. నా మాటలు వెనుక పరమార్థం ఉంది. కొద్ది రోజులు ఆగితే అదేంటో తెలుస్తుంది. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరూ తప్పుగా భావించొద్దు’ అని జగ్గారెడ్డి తెలిపారు.
(ఇక్కడ చదవండి: ఎంత చెల్లించి మా ఎమ్మెల్యేలను కొన్నారు: ఉత్తమ్)
Comments
Please login to add a commentAdd a comment