కొండా దంపతుల ఘర్‌వాపసీ.. రాష్ట్రమంతటా ప్రచారం! | Congress Party Like Own House, says konda surekha | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 26 2018 1:56 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Congress Party Like Own House, says konda surekha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ త​మ సొంతిల్లు లాంటిదని తాజాగా ఆ పార్టీలో చేరిన కొండా సురేఖ అన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ఆమె మాట్లాడారు. తాను బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరానని, తమ కుటుంబానికి రెండు, మూడు సీట్లు అడుగుతున్నానని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తెలంగాణ రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం చేస్తానన తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమలాంటి సమర్ధ నాయకులు టీఆర్ఎస్‌లో ఉంటే ప్రశ్నిస్తారనే భయంతోనే టీఆర్ఎస్ తమను పక్కన పెట్టిందన్నారు.

రాష్ట్రమంతటా ప్రచారం..!
కొండా సురేఖ దంపతులు మళ్లీ ఘర్ వాపసీ అయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పార్టీ ప్రచార కమిటీలో కొండా సురేఖకు స్థానం కల్పిస్తామన్నారు. రాష్ట్రమంతటా ఆమె తిరిగి ప్రచారం చేస్తారని వెల్లడించారు. బేషరతుగానే కొండ దంపతులు పార్టీలోకి చేరారని, వారి రాకతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయిందని పేర్కొన్నారు.  కొండా సురేఖ సమర్ధులైన బీసీ నాయకురాలు అని, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమె ప్రభావం ఉంటుందని రాహుల్ గాంధీ భావిస్తున్నారని చెప్పారు. ఆమె సమర్థతపై రాహుల్ గాంధీకి పూర్తి నమ్మకం ఉందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement