సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు ప్రత్యక్ష పరోక్ష ఆరోపణలు చేసుకుంటూ ఒకరిమీద ఒకరు విమర్శణ బాణాలు ఎక్కుపెడుతున్నారు. యువతను ప్రసన్నంచేసుకోవడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు, నేతలు పావులు కదుపుతున్నాయి. దీనిలో భాగంగా సోషల్‌మీడియ వేదికగా వినూత్న రీతిలో ప్రచారాలు, మేమ్స్, పేరడీలతో యువతను ఆకట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ జాబితాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెగపోటీపడుతున్నాయి. ఒకరు పోస్ట్ చేసిన ఫోటో/వీడియోకు కౌంటర్‌గా మరొకరు అదేరీతిలో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో రాజకీయ వేడి సృష్టిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ ద్వారా విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శిస్తూ చేసిన ఈ వీడియో కాంగ్రెస్ అభిమానులను, కార్యకర్తలను తెగ ఆకట్టుకుంటోంది. ‘డర్ కె ఆగే అజాదీ’.. భయం వీడితేనే దేశానికి మోదీ నుంచి స్వాతంత్ర్యం అంటూ సాగిన పాటకు కొద్ది గంటల్లోనే వేల లైక్‌లు, వ్యూస్ వచ్చాయి. ఇక ఈ వీడియోపై మోదీ, బీజేపీ మద్దతుదారులు కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ కౌంటర్లే ఇస్తున్నారు. గతంలో జరిగిన స్కామ్‌లు, మౌన ప్రధాని అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీలు సోషల్ మీడియాలో గల్లీ బాయ్స్ మాదిరిగా పోట్లాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment