
ఎన్నికల ప్రచారం ఈసారి కొత్త పుంతలు తొక్కుతోంది. గత ఎన్నికల వరకు సభలు, సమావేశాలతో పాటు అభ్యర్థులు నేరుగా ఇంటింటి ప్రచారం చేసేవారు. ఈసారి అదనంగా డిజిటల్ పద్ధతి తోడైంది. వాహనానికి రెండు వైపులా ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసి..తాము చేపట్టబోయే పనులతో పాటు పార్టీ విధానాలను ప్రదర్శిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలైతే ఆ నియోజకవర్గ సమస్యలను.. అసెంబ్లీలో ప్రస్తావించిన ఘట్టాలను కూడా చూపిస్తున్నారు. మధ్యమధ్యలో పాటలు కూడా వేస్తున్నారు. ఎల్‌ఈడీ వెలుగుల్లో పాట–మాట ద్వారా ప్రచారం వినూత్నంగా సాగుతోంది. పల్లెల్లో ఈ వాహనాలను ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. కడ్తాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఇలా ఎల్‌ఈడీ తెర ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
– కడ్తాల్, రంగారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment