పాక్‌లో ట్రంప్ వ్యతిరేక నిరసనలు
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ టెర్రరిస్టులను నిర్మూలించడంలో సహకరిస్తుందన్న నమ్మకంతో పాకిస్థాన్‌కు గత 15 ఏళ్లుగా అమెరికా అధ్యక్షులు ఆర్థికంగా నిధులను అందజేస్తూ వస్తున్నారు. పాక్ భూభాగం టెర్రరిస్టులకు స్వర్గధామంగా మారిందంటూ అంతర్జాతీయ నివేదికలు లేదా వార్తలు వెలుగుచూసినప్పుడల్లా పాక్ ఆర్థిక సహాయంలో కోత విధిస్తామని లేదా పూర్తిగా నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షులు బెదిరించడం, ఆ తర్వాత సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేయడం పరిపాటిగా కొనసాగుతున్న పరిణామమే.(సాక్షి ప్రత్యేకం)
కానీ ఈసారి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ మరింత ఘాటుగా స్పందించారు. గత 15 సంవత్సరాల్లో పాకిస్థాన్‌కు ఇప్పటివరకు 3,300 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తే అందుకు ప్రతిఫలంగా తమకు దక్కింది ద్రోహం తప్ప మరేమి లేదని, ఇక ఇచ్చేదేమీ కూడా లేదని ట్వీట్ చేశారు. ఇంతఘాటుగా స్పందించిన ఆయన తన మాట మీద(సాక్షి ప్రత్యేకం) నిలబెడతారా? నిజంగానే ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తారా? ఎందుకంటే, పాకిస్థాన్‌ను ఉద్దేశించి ఇలాంటి ఘాటు హెచ్చరికలు చేసి, చివరకు ట్రంప్ పక్కకు తప్పుకున్న సందర్భాలు ఉన్నాయి.
అలాంటి అవకాశం ఈసారి ట్రంప్‌కు లేదని ఇటు అమెరికా, అటు పాకిస్థాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యల పట్ల పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారు నాడు ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబారిని పిలిపించి నిరసన వ్యక్తం చేయగా, బుధవారం నాడు పాకిస్థాన్ ప్రధానమంత్రి సాహిద్ ఖాకన్ అబ్బాసి అత్యవసరంగా దేశ జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. (సాక్షి ప్రత్యేకం)ఇందులో అమెరికాతో తమ దేశ విదేశాంగ సంబంధాలను సమీక్షించారు. ముఖ్యంగా అమెరికా బెదిరింపులను తిప్పికొట్టాలా, దౌత్యమార్గాల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలా? అన్న అంశంపై చర్చ జరిగినట్లు తెల్సింది.
ఇప్పటికే చైనాతో మెరుగైన సంబంధాలున్నందున, రష్యాతో కూడా సంబంధాలను పెంచుకోవడం ద్వారా అమెరికాకు బుద్ధి చెప్పవచ్చని సమావేశంలో కొంతమంది సభ్యులు అభిప్రాయపడ్డారట. ఈ వ్యూహాన్ని అనుసరించినట్లయితే ‘నాన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్’ మిత్రపక్షంగా పాకిస్థాన్‌ను గుర్తించడాన్ని అమెరికా మానేస్తుందని, పర్యవసానంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంగానీ, ఆయుధ సంపత్తి సరఫరాగానీ ఇక అమెరికా నుంచి అందదని గతంలో అమెరికాలో పాకిస్థాన్ రాయబారిగా పనిచేసిన హుస్సేన్ హక్కానీ హెచ్చరించారట. (సాక్షి ప్రత్యేకం)అమెరికా అధ్యక్షులు తమకుడ ఇలాంటి హెచ్చరికలు చేయడం సహజమే కనుక మళ్లీ వారి మనుసు మారే అవకాశం ఉందని, అందుకోసం కృషి చేద్దామని సూచించారట. అప్పటి వరకు వేచి చూసే విధానమే మంచిదన్నారట.
క్రిస్మస్‌కు కొన్ని రోజుల ముందు అఫ్ఘానిస్థాన్‌కు అమెరికా ఉపాధ్యక్షడు మైక్‌పెన్స్ వెళ్లినప్పుడు పాకిస్థాన్ పట్ల ట్రంప్ కఠిన వైఖరిని అవలంబిస్తున్నారని, దానివల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అక్కడి అమెరికా సైన్యాన్ని హెచ్చరించారు. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను అమెరికా ప్రకటించడాన్ని ఐక్యరాజ్యసమితిలో పాక్ వ్యతిరేకించి ఓటువేయడాన్ని కూడా ట్రంప్ జీర్ణించుకోలేక పోయారు. ఈ విషయం ముందుగానే తెలియడంతో ‘కోట్లాది డాలర్లు, కోటానుకోట్ల డాలర్లు మనదగ్గర తీసుకొని మనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారటనా! చూద్దాం! మనకు వ్యతిరేకంగా ఓటు వేయనీ. అదీ మన మంచికే కోటానుకోట్ల డాలర్లు మనకు మిగిలిపోతాయి’ అని ట్రంప్ తన ఆంతరంగికులతో వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.(సాక్షి ప్రత్యేకం) ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా అమెరికా కఠిన వైఖరి అవలంబిస్తే అది మనదేశ దౌత్య విజయంగా మన దేశ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఒకవేళా ఈసారి కూడా ట్రంప్ తన మాటా మార్చుకుంటే దాన్ని మన భారత ప్రభుత్వం ఎలా చెప్పుకుంటుందో చూడాలి!(సాక్షి ప్రత్యేకం)
Comments
Please login to add a commentAdd a comment