చంద్రబాబు నాయుడి ఫోటోను దహనం చేస్తున్న బీజేవైఎం నాయకులు
జహీరాబాద్ టౌన్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తిరుమలకు వచ్చిన సందర్భంగా ఆయన వాహనంపై టీడీపీ శ్రేణులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం బీజేవైఎం నాయకులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబు నాయుడి చిత్రపటాలను పట్టణంలో ఊరేగింపుగా తీసుకొచ్చి రహదారిపై దహనం చేశారు. పలువురు నాయకులు మాట్లాడుతు సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఉసిగొలిపి బీజేపీ జాతీయ అధ్యక్షుడి వాహనంపై దాడి చేయించారని ఆరోపించారు.
బీజేపీ వల్ల అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాజకీయ ఉనికి కోసం డ్రామాలాడుతున్నారన్నారు. కేంద్రం ఇచ్చిన లక్షల కోట్లను దుర్వినియోగం చేసి, అక్రమంగా డబ్బు సంపాదించి బీజేపీపై విమర్శలు చేస్తున్నారని, జాతీయ అ«ధ్యక్షుడిపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడి పాపం దగ్గరపడిందని, తర్వలో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
బీజేౖవైఎం అసెంబ్లీ కన్వీనర్ సొమాఅనిల్, పట్టణ అధ్యక్షుడు నరేశ్ పాటిల్, జిలా కో«శాధికారి బండివెంకట్, జిల్లా నాయకుడు పూల సంతోశ్, నాయకులు సాయితేజ, తుక్కారెడ్డి, అప్పం శ్రవణ్, బీజేపీ నాయకులు రాఘవేంద్రనాయక్, అరుణ్, సుధీర్ బండారీ, శ్రీకాంత్, విజయ్‌చారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment