
సాక్షి, కృష్ణా : టీడీపీకి మరో షాక్ తగిలింది. అవనిగడ్డ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ జగన్ సమక్షంలో మంగళవారం మధ్యాహ్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు తమకు గుర్తింపునివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే టీడీపీని వీడుతున్నట్టు తెలిపారు.
2014 ఎన్నికల్లో తనను కాదని మండలి బుద్ధప్రసాద్‌కు టికెట్ ఇచ్చిన చంద్రబాబు.. ‘నీ బాధ్యత నేను తీసుకుంటా. తగిన ప్రాధాన్యం ఇస్తానని చెప్పి మోసం చేశాడు. మానసిక వేదనతోనే టీడీపీని వీడాను. వైఎస్సార్‌సీపీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉంది. వైఎస్ జగన్ అవనిగడ్డకు వస్తున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో పార్టీలో చేరడం శుభపరిణామంగా భావిస్తున్నాను’ అని శ్రీహరి అన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కృష్ణా జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎంపీ, దివంగత బ్రాహ్మణయ్య వారసుడు శ్రీహరి.
(చదవండి : కొండంత అండగా నేనున్నాను: వైఎస్ జగన్)
పశ్చిమ గోదావరిలో టీడీపీకి షాక్..!
పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. నరసాపురం టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ చాగంటి సత్యనారాయణ ఆ పార్టీకీ రాజీనామా చేశారు. ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు.
నెల్లూరులో పచ్చపార్టీకి షాక్..!
వెంకటగిరిలో టీడీపీకి షాక్ తగిలింది.70 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన వెంకటగిరి రాజాలు టీడీపీని వీడారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వెంకటగిరి సమన్వయకర్త ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. రాజాలుతో పాటు టీడీపీ నెల్లూరు జిల్లా తెలుగుమహిళ మాజీ అధ్యక్షురాలు, నువ్వుల మంజుల పలువురు టీడీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment