
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఫలితాల వెల్లడి మొదలైన నుంచి కారు జోరు చూపించడంతో మంగళవారం ఉదయం నుంచే తెలంగాణ భవన్‌లో కార్యకర్తలు ఫుల్‌జోష్‌లో కనిపించారు. టపాసులు కాలుస్తూ, నృత్యాలు చేస్తూ గులాల్ చల్లుకుంటూ ఆనందోత్సవాల్లో తేలిపోయారు. ‘జయహో కేసీఆర్’అంటూ ప్లకార్డులు పట్టుకొని జైతెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్, సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి కార్యకర్తలతో కలసి సంబరాల్లో పాల్గొన్నారు. ‘కేటీఆర్ జిందాబాద్, కాబోయే సీఎం’ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ టీఆర్‌ఎస్ భవన్‌కు వచ్చిన సమయంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
మిగతా పార్టీల్లో నిస్తేజం..
టీఆర్‌ఎస్ జోరుతో మిగతాపార్టీల్లో పూర్తిగా నిస్తేజం అలముకుంది. గాంధీభవన్‌లో నేతల సందడి లేక వెలవెలబోయింది. సీనియర్ నేతలు జానారెడ్డి, రేవంత్, గీతారెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీకే అరుణ, జీవన్‌రెడ్డి ఓటమి పాలవడంతో పార్టీ శ్రేణులు డీలాపడ్డాయి. మధ్యాహ్నం మూడు గంటలకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌కు వచ్చినా సందడి లేదు కనబడలేదు. టీడీపీ, బీజేపీ, సీపీఐ కార్యాల యాలు పూర్తిగా కళతప్పాయి. నేతలెవరూ ఆ వైపు రాలేదు. టీజేఎస్ ఆఫీస్‌కు కోదండరాం ఒక్కరే వచ్చి మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment