వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే దేముడు కుమార్తె | Goddeti Madhavi Join In YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే దేముడు కుమార్తె

Published Sun, Aug 26 2018 7:10 AM | Last Updated on Mon, Aug 27 2018 1:40 PM

Goddeti Madhavi Join In YSRCP - Sakshi

గొడ్డేటి మాధవి

సాక్షి, విశాఖపట్నం: చింతపల్లి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తె మాధవి శనివారం రాంబిల్లి మండలం పంచదార్లలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఆమె వెంట పాడేరు నియోజకవర్గానికి చెందిన వేలాది మంది సీపీఐ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతోపాటు దేముడు అభిమానులు వందలాది వాహనాల్లో పాల్గొన్నారు. బీఎస్సీ, బీపీఈడీ పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం కొయ్యూరు గిరిజన సంక్షేమ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉంటూ అస్వస్థతకు గురైన దేముడు 2015 అక్టోబర్‌లో మరణించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దేముడిని మెరుగైన వైద్యం కోసం మన్యం నుంచి హెలి కాప్టర్‌లో హైదరాబాద్‌ తరలించిన విషయాన్ని వెంట వచ్చిన అభిమానులు గుర్తు చేసుకున్నారు. మాధవికి తల్లి చెల్లయ్యమ్మ, ఇద్దరు సోదరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement