
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఓ అవి నీతి చక్రవర్తి అని ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి అభివర్ణించారు. సీఎంగా ఎంత గొప్పవారు వచ్చి నా ఎంతో కొంత అవినీతి జరుగుతుందని, కానీ దేశచరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అవి నీతి ఎప్పుడూ జరగలేదన్నారు. గత నాలుగేళ్లుగా దోచుకుని దాచుకోవడమే కేసీఆర్ పని గా పెట్టుకున్నారని దుయ్యబట్టా రు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ఇచ్చి న అధికారాన్ని కేసీఆర్ పూర్తిగా దుర్వినియోగం చేశారని విరుచుకుపడ్డారు.
సోమవారం గాంధీభవన్‌లో జైపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. గడచిన నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు కంపెనీలకు రూ.77 వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తనకింత.. తన కుటుంబ సభ్యులకింత.. మంత్రులు, ఎమ్మెల్యేలకింత.. అని నిర్ణయించి కేసీఆర్ నొక్కేశారన్నారు. ఒక కంపెనీకి కాళేశ్వరం 1, 2, 3 దశల్లో రూ.27,407 కోట్లు, పాలమూరులో రూ.12,444 కోట్లు, సీతారామ ప్రాజెక్టు లో రూ.2,775 కోట్లు, డిండిలో రూ.850 కోట్లు, మిష న్ భగీరథలో రూ.14వేల కోట్ల కాంట్రాక్టులను ఇచ్చారన్నారు. మరో కంపెనీకి సాగునీటి శాఖలో రూ.17 వేల కోట్ల విలువైన పనులను అప్పగించారన్నారు.
నిరూపించేందుకు రెడీ..
కేసీఆర్ ఎంత అవినీతిపరుడో నిరూపించేందుకే గణాంకాలతో కూడిన కఠిన వాస్తవాలను తాను మీడియాకు వెల్లడిస్తున్నానని జైపాల్ చెప్పారు. తాను చెప్పిన గణాంకాలపై ఎవరైనా చాలెంజ్ చేస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తెలంగాణను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అమ్మేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్న కేసీఆర్.. గత నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ రెండు కాంట్రాక్టు కంపెనీలకు అమ్మేయలేదా అని ప్రశ్నించారు.
ఆ కంపెనీలకు కేసీఆర్ కట్టుబానిసలా మారారని ఎద్దేవా చేశారు. ఇలాంటి దురదృష్టకర పరిస్థితి గతంలో ఎన్నడూ లేదన్నారు. ఆ రెండు కంపెనీలకు కట్టబెట్టిన కాంట్రాక్టుల విలువలో కనీసం 30 శాతం అధిక అంచనాలున్నాయని, మొత్తం 77వేల కోట్లకుగాను అసలు విలువ రూ.50 వేల కోట్లే ఉంటుందని, మిగిలిన రూ.20 వేల కోట్లు కాంట్రాక్టర్లు, కేసీఆర్, వందిమాగధులు దోచుకున్నారని ఆరోపించారు.
అందుకే రూ.2 లక్షల కోట్ల అప్పు..
తెలంగాణను అప్పుల ఊబిలోకి దించిన కేసీఆర్ రూ.2 లక్షల కోట్ల అప్పు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికే చేశారని జైపాల్ దుయ్యబట్టారు. ఒక ఎకరాన్ని నీటితో తడపకుండా, ఒక్క ఇంటికీ నీళ్లివ్వకుండా, ఒక్క కంపెనీకే రూ.60 వేల కోట్ల కాంట్రాక్టులిచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంట్రాక్టులు ఆంధ్ర వాళ్లకే కాదు, అమెరికా వాళ్లకు ఇచ్చినా తమ కు అభ్యంతరం లేదని, అయితే, అది న్యాయబద్ధం గా జరగాలని వ్యాఖ్యానించారు.
ఈ కంపెనీలకు ఇచ్చిన టెండరింగ్ ప్రక్రియ అంతా బోగస్ అని అన్నా రు. దీనిపై కేసీఆర్ తనకు, ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టీఆర్‌ఎస్ ఇచ్చిన సాగు నీటి కాంట్రాక్టులపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు. అవినీతికి బాధ్యులైన వారికి తగిన శిక్ష వేయిస్తామని, ఆ బాధ్య త తాను తీసుకుంటానని జైపాల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment