హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పెద్ద కుమారుడు జలగం ప్రసాద రావు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ప్రసాదరావు గతంలో రెండు సార్లు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. ఈ సందర్భంగా జలగం ప్రసాద రావు తెలంగాణా భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..మహా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నీళ్లు రావని వ్యాఖ్యానించారు. ఒకసారి ఆలోచించుకోవాలని కేటీఆర్ అడిగితే ఆలోచించి టీఆర్‌ఎస్‌లో చేరానని తెలిపారు.
టీడీపీ, కాంగ్రెస్‌లో చేరటంతో అష్టదరిద్రాలు ఇక్కడికే వచ్చాయని తీవ్రంగా మండిపడ్డారు. బడుగు వర్గాల కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో పది సీట్లు టీఆర్‌ఎస్ గెలిచేలా కృషి చేస్తానని మాటిచ్చారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎవరున్నా విజయం కోసం కృషి చేస్తానని తెలిపారు. నాలుగేళ్ల క్రితమే కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించినా కొన్ని కారణాల వల్ల ఇప్పటికి కుదిరిందని వెల్లడించారు.
కూటమికి ఓటేస్తే మన వేలితో మనం పొడుచుకున్నట్లే: కేటీఆర్
ఖమ్మం జిల్లా సమస్యల్ని జలగం ప్రసాద రావు తనకు వివరించారని కేటీఆర్ తెలిపారు. మన జుట్టు చంద్రబాబు నాయుడికి అందించవద్దని ప్రజలను కోరారు. చూపులు కలిసిన శుభవేళ పొత్తులు కలిశాయని వ్యాఖ్యానించారు. అమరావతి చంద్రబాబు ఆఫీసు దగ్గర తెలంగాణ కాంగ్రెస్ నేతలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
మహాకూటమికి ఓటు వేస్తే రైతులు చంద్రబాబు, ఆంధ్రా చుట్టూ తిరగాల్సి వస్తుందని, తెలంగాణా రైతులు తమ వేలితో తామే పొడుచుకోవాల్సి వస్తుందన్నారు. ప్రజలంతా ఆలోచించి మన హక్కుల కోసం ఓటు వేయాలని కోరారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు ఓటు వేస్తే జీవన విధ్వంసం జరుగుతుందని వ్యాఖ్యానించారు.
టీడీపీ రాకతో కాంగ్రెస్‌లో అష్టదరిద్రాలు: జలగం
Published Sat, Nov 3 2018 7:40 PM | Last Updated on Sat, Nov 3 2018 9:38 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment