
విజయవాడ: టీడీపీ నాయకులకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ సవాల్ విసిరారు. విజయవాడలో పోతిన మహేశ్ విలేకరులతో మాట్లాడారు. పబ్లిసిటీ కోసం టీడీపీ నాయకులు పవన్ కల్యాణ్‌పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రౌడీషీటర్, నగర బహిష్కరణ చేసిన కాట్రగడ్డ బాబు ప్రచారం కోసమే ఫ్లెక్సీలు పెట్టారని ఆరోపించారు. జనసేనను రెచ్చగొడితే టీడీపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
టీడీపీ నాయకులు ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు కడుతుంటే పోలీసులు, నగరపాలక అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు దమ్ముంటే టీడీపీ అవినీతి, అరాచకాల మీద ఫ్లెక్సీలు పెట్టాలని సూచించారు. పవన్ కల్యాణ్ దయ మీద 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడేదిలేదని తేల్చిచెప్పారు. కిరాయి డబ్బులకు హత్యలు చేసే వ్యక్తి పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment