సాక్షి, బెంగళూరు : అప్పుడే కర్ణాటక ఎన్నికలపై మీడియాలో చర్చలు గరమెక్కుతున్నాయి. ముందస్తుగా సమాచారాన్ని సేకరించడం, ఒపినీయన్ పోల్స్ నిర్వహించడంవంటి పనుల్లో మీడియా సంస్థలు నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో తాము తప్పకుండా విజయం సాధిస్తామని జనతాదల్ (జేడీఎస్) పార్టీ నుంచి గట్టి వాయిస్ వినిపిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార్ స్వామి జరగబోవు ఎన్నికలపై తన జోస్యాన్ని, అంచనాలను ఓ మీడియాకు వెల్లడించారు. తమ రాష్ట్రంలో హంగ్ పరిస్థితి ఏర్పడినా తాము మాత్రం కాంగ్రెస్ పార్టీతోగానీ, బీజేపీతోగానీ పొత్తు పెట్టుకునే సమస్య లేదన్నారు. తమ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ హవా లేదని, కాంగ్రెస్ పార్టీ తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత తమ పార్టీకి అనుకూలిస్తుందని అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించామని మొత్తం 224 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించాలని భావిస్తున్నామని చెప్పారు. కనీసం తాము 113 స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. తమ రాష్ట్రంలో అవినీతికి పునాది వేసిందే బీజేపీ అని, అది కాంగ్రెస్ పార్టీలో మరింత ఎక్కువయిందని ఆరోపించారు. కర్ణాటక తీర ప్రాంతంలో ఘర్షణలు నిద్రలేపి విభజన వాదంతో కాంగ్రెస్, బీజేపీ లబ్ధిపొందాలని భావిస్తున్నాయని అన్నారు. అక్కడికెళ్లి అభివృద్ధి గురించి మాట్లాడటం మానేసి కేవలం భయపెట్టి వారితో తమను ఓట్లకోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఏదేమైనా ఈసారి పొత్తు మాత్రం తాము ఎవరితో పెట్టుకోబోమని స్పష్టం చేశారు.
'హంగ్ వచ్చినా పొత్తు పెట్టుకోం.. ఒంటరిగానే'
Published Mon, Jan 8 2018 11:23 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment