జగిత్యాల జిల్లా : ఎన్డీయే ప్రభుత్వంపై సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ..హిందూ-ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడానికే ఎన్డీయే ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ చెల్లుబాటు కాదని, దానిపై ప్రభుత్వం చట్టం అమలు చేయాలని మాత్రమే కోరిందని వివరించారు.
ట్రిపుల్ తలాక్ చెల్లుబాటులో లేనపుడు 3 సంవత్సరాల జైలు శిక్ష ఎలా వేస్తారని ప్రశ్నించారు. కామన్ సివిల్ కోడ్‌ను క్రిమినల్ కోడ్‌గా మార్చడానికి బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. మతానికి సంబంధించిన పర్సనల్‌లాలో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో అడ్డుకున్నామని, ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పాస్ కానివ్వమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment