
దొడ్డబళ్లాపురం: ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌గౌడకు మద్దతుగా మండ్యలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం పట్ల కన్నడిగులు సామాజిక మాధ్యమాల ద్వారా కడిగేశారు. బాబు ఎన్నికల ప్రచారానికి సంబంధించి కొన్ని కన్నడ చానళ్లు ఆన్‌లైన్, ఫేస్‌బుక్‌లలో వార్తలు వేయగా నెటిజన్లు అధికసంఖ్యలో స్పందించారు. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇలా అన్ని మాధ్యమాల్లోనూ చంద్రబాబుకు వ్యతిరేకంగా కన్నడిగులు, ముఖ్యంగా యువత గళమెత్తారు.
సోషల్ మీడియాలో చంద్రబాబుపై చలోక్తులు
నెటిజన్లు చంద్రబాబును ఏమన్నారంటే మచ్చుకు...
♦ ‘కర్ణాటక గోల నీకెందుకు. మొదట ఆంధ్రాలో నీ ఉనికి చూసుకో.
♦ ఏపీ తరువాతి ముఖ్యమంత్రి జగనే. నువ్వు జైలుకెళ్లడం ఖాయం. 420 సీఎం నువ్వు.
♦ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూస్తే నీ భాగోతం తెలుస్తుంది.
♦ సీ ఇన్ ఏపీ ఆన్ మే 23, యూ హ్యావ్ ఏ గిఫ్ట్
♦ పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచావు. 23న నీ చేతికి చెంబు. నీకు చివరి ఎలెక్షన్ అయిపోయింది.
♦ ఒక దొంగ మిగతా దొంగలకు ఎన్నికల ప్రచారం చేస్తాడంట.
♦ దొంగల బ్యాచ్‌లో పెద్దదొంగ.
♦ ఒక అనినీతి పరుడ్ని ఎన్నికల ప్రచారానికి తీసుకురావడం అవసరమా?
♦ ఇలా ఇంకా పదునైన మాటలతో చంద్రబాబు నాటకాల మీద నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment