సాక్షి నెట్‌వర్క్ : ‘హైదరాబాద్‌ని నేనే నిర్మించా అని బాబు అంటుండు. కులీకుతుబ్ షా ఉంటే ఏం కావాలి? నా గాశారం బాలేక చంద్రబాబుతో కొంతకాలం పనిచేశా. మెంటల్ అయిందేమోనని చూపియ్యాలని కూడా చెప్పిన. హైదరాబాద్ గురించి గట్ల మాట్లాడుతరా. ఓ సభలో బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ఓడియ్యాలని అంటుండు. ఆయనమో కాంగ్రె స్ కూటమిలో ఉన్నడు. ఏమన్న కిందమీదకు అయ్యిందేమో. దేనికి మద్దతు ఇస్తుండో దాన్నే ఓడించాలంటుండు. అంత గతి తప్పి మాట్లాడొద్దు కదా’ అని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం నాగర్‌కర్నూల్, చేవెళ్ల, పటాన్‌చెరుల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో మాట్లాడారు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు..తన పరిపాలనలో కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయాడో చెప్పాలన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, కాపలా కుక్కలా పనిచేస్తేనే ఇది సాధ్యమైందని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో పవర్ హాలీడేతో పరిశ్రమలు ఇబ్బందులు పడ్డాయని, ఇప్పుడు పవర్ హాలీడే స్థానంలో పవర్ డే వచ్చిందన్నారు. ప్రజలిచ్చిన శక్తితో నాలుగేళ్లు పాలించానని సంతోషం వ్యక్తంచేశారు. ఇప్పుడు కూటమి రూపం లో పెనుముప్పు ముంచుకొస్తోందని హెచ్చరించారు . ‘కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలు. శాతకాదు. నాటి నుంచి ఇదే కథ. మంచిగా ఉండే తెలంగాణను ఆగం చేసిండ్రు. 1956లో తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ భక్తులు. అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఢిల్లీ పెద్దల విజ్ఞప్తి మేరకు విలీనం చేసిండు. 1969లో తెలంగాణ రాష్ట్రం కావాలని అడిగి తే అప్పుడు ఇందిరాగాంధీ పిట్టల మాదిరిగా 400 మందిని కాల్చి చంపిండ్రు. అప్పుడు కూడా కాంగ్రె సోళ్లు నోరు మూసుకున్నరు. ఇది కథకాదు.. చరిత్ర. వాస్తవం. మళ్లీ మొన్న కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనని సవాలు చేసినా నోరు మెదపలేదు. ఒక్కరన్నా రాజీనామా చేసిండ్రా? గింత పౌరుషం లేదా? బూర్గుల నుంచి నేటి కాంగ్రెస్ నా యకులది ఇదే దద్దమ్మ సంగతి. ఆ నాయకులకు ఎమోషన్ లేదు.. ఆవేశం లేదు. ఆంధ్రకు పోయి బా బుని నెత్తిన పెట్టుకుని తీసుకొచ్చిండ్రు. మళ్లీ బాబు పెత్తనం అవసరమా? ఎట్లా తోలుకొస్తున్నారు. ఆయ న గెలుస్తడా? పొరపాటున గెలిస్తే ఆయన మనసంతా ఆంధ్రా దిక్కే ఉంటది. అంటే గెలిచేది లేదు.. పీకేది లేదనుకోండి. ఒకవేళ కూటమి గెలిస్తే దరఖాస్తులు పట్టుకుని అమరావతి పోవాలా? ఎవని కాళ్లు పట్టుకోవాలి? ఇప్పటి కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాం లు. ఇప్పుడు అమరావతి గులాంలు. వాళ్లకు గులాములు కావాల్నా? టీఆర్‌ఎస్ గెలిస్తే కాళేశ్వరం నీళ్లొ స్తాయి. కూటమి గెలిస్తే శనేశ్వరం వస్తది. కాళేశ్వరం కావాలా.. శనేశ్వరం కావాల్నా? పుచ్చులుంటే కూరగాయల్ని పక్కన పడేస్తం. కుండ కొంటే కొట్టి చూ స్తాం. ఓటు ఎవరికి పడితే వారికి వేస్తమా? ఓటు అంటే తలరాత రాసుకోవడం. మంచి చెడుల ను ఆలోచించి ఓటేయాలె’అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు .
111 జీఓ ఎత్తివేస్తాం..
చేవెళ్ల ప్రాంత వాసులకు శనిగా మారిన 111 జీఓను ఎత్తివేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోగా దీన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ కింది భాగంలో ఉన్న గ్రామాలను కూడా ఈ జీఓ పరిధిలోకి తెచ్చారని తెలిపారు. ఈ చెరువుల నీళ్లు ఇక హైదరాబాద్‌కు అవసరం ఉండబోవన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేవు
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు చేపడుతున్నామని, మేనిఫెస్టోలో పేర్కొనని 72 పథకాలు అమలు చేస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లపై ఉన్న రూ.4,316 కోట్ల అప్పును టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే మాఫీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక మోదీ లాంటి పెద్ద మనిషి అబద్ధాలాడటం సరికాద న్నారు. నిజామాబాద్‌లో మోదీ మాట్లాడుతూ తెలం గాణలో కరెంట్ లేదన్నారని, అక్కడే ఉంటే వచ్చి సమాధానమిస్తానన్నా ఆయన ఆగలేదన్నారు. ఇంకో నెలలో మిషన్ భగీరథ ద్వారా అన్ని ఇళ్లకు నీరందిస్తామన్నారు. బిందె పట్టుకుని మహిళలు బయటకు వస్తే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తానని హెచ్చరించినట్టు కేసీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెసోళ్లు ఇంటికి రుణం ఇస్తరంట...
‘కాంగ్రెస్ మేనిఫెస్టోను పరిశీలిస్తే.. డబుల్ బెడ్‌రూంలకు సంబంధించి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు.. దళితులకు, బీసీలకు రూ.6 లక్షలు రుణం ఇస్తామని చెబుతుండ్రు. మేం రుణ రూపేణా కాకుండా రూ.5 లక్షలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇస్తం. కాంగ్రెస్సోళ్లు రుణం ఇచ్చి వసూలు చేస్తరు. మేం అలా చేయబోం’అని కేసీఆర్ స్పష్టంచేశారు.
తెలంగాణ బిడ్డలుగా ఉండండి..
‘పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్ ప్రాంతాల్లో ఆంధ్ర, రాయలసీమ నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉంటరు. మీ అందరితో ఒకే మాట మనవి. మీరు ఆంధ్రావాళ్లమనే భావన వదిలిపెట్టండి.. తెలంగాణ బిడ్డలుగా ఉండండి. మీరు ఎప్పుడో వచ్చిం డ్రు కాబట్టి స్థానికులే.. మీరు స్థానిక సర్టిఫికెట్ తీసుకుని దొర కొడుకు ల్లాగా ఉండండి. ఎవరై నా ప్రజలే.. గత నాలుగున్నరేళ్ల పాలనలో ఏ ఒక్కరోజూ ఆంధ్ర, తెలంగాణ అనే వివక్ష పాటించలేదు. ఇక్కడ ఉన్నవారందరూ తెలంగాణ బిడ్డలే.. అందరూ గౌరవంగా, ఐక్యంగా ఉందాం’అని కేసీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment