ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు
మంచిర్యాల జిల్లా కోసం అనేక ఏళ్లు కొట్లాడిండ్రు. జిల్లా చేయమంటే నాయకులు ఏళ్లకేళ్లుగా ఏడ్చిండ్రు. ఒక్క మాటతో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు ఏర్పాటు చేసినం. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పుడు మంచిర్యాల, పెద్దపల్లి రెండు జిల్లాలు ఏర్పాటయ్యాయ్. అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లాలోనే ఉన్నది. వచ్చే ఏడాదికి గోదావరి ఇట్ల కనవడదు. ఏడాదంతా నీళ్లతో కళకళలాడుతుంది. 200 కిలోమీటర్ల గోదావరి బ్రహ్మాండమైన, సజీవమైన దృశ్యం మన కళ్లముందుంటది. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను 16 స్థానాల్లో గెలిపిస్తే ఢిల్లీనే శాసిస్తం’ అని గోదావరిఖని ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ అన్నారు.
సాక్షి, గోదావరిఖని(రామగుండం): మంచిర్యాల జిల్లా కోసం అనేక ఏళ్లు కొట్లాడిండ్రు. జిల్లా చేయమంటే నాయకులు ఏళ్లకేళ్లుగా ఏడ్చిండ్రు. ఒక్క మాటతో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గోదావరిఖని డిగ్రీ కళాశాల మైదా నంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచిర్యాల, పెద్దపల్లి రెండు జిల్లాలు ఏర్పాటయ్యాయన్నారు. అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లాలోనే ఉందని తెలిపారు. వచ్చే ఏడాదికి గోదావరి ఇలా కనిపించదని, నీళ్లతో కళకళలాడుతుందని పేర్కొన్నారు. 200 కిలోమీటర్ల గోదావరి బ్రహ్మాండమైన, సజీవమైన దృశ్యం మన కళ్లముందుంటుందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి 16 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఢిల్లీని శాసిస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ సభలు జనాలు లేక వెలవెలబోతున్నాయని విమర్శించారు. కేంద్రాన్ని పాలించబోయేది, శాసించబోయేది ప్రాంతీయపార్టీల కూటమేనని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ సభ జరిగితే 3 వేలు, 4 వేల మంది వచ్చారని, నరేంద్రమోదీ సభకు మందిలేక బయట కూర్చున్నారని ఎద్దేవా చేశారు. మాయమాటలు నమ్మవద్దన్నారు.
కార్మికులు మిలిటరీ కన్నా తక్కువేమీ కాదు
బొగ్గుగనుల్లో పనిచేసే కార్మికులు మిలిటరీ కన్నా తక్కువేమీ కాదన్నారు. బొగ్గుగని కార్మికుల జీతాల్లో కట్ చేసే ఇన్‌కంటాక్స్‌ను మాఫీ చేయడంతో కేంద్ర సర్కార్ నడుస్తదా.. అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సింగరేణి కార్మికుల కోసం తాను ఇచ్చిన మాటకు నిలబడి సరిహద్దు సైనికులతో సమానంగా గుర్తించి ఇన్‌కంటాక్స్ మాఫీ చేయమని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానించాం. దేశంలో గుణాత్మక మార్పు రావాలన్నారు. సింగరేణి కార్మికులకు గతంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు తాము అమలు చేశామన్నారు. డిపెండెంట్, ఇంకోరకమైనదో 6,742 మందికి ఉద్యోగాలిచ్చాం.. మిగతా వాళ్లకు కూడా ఇచ్చే బాధ్యత తమదేనన్నారు.
ఎవరికైతే ఉద్యోగం వద్దనుకున్నారో వారికి ఒకేసారి రూ.25 లక్షలు అందజేస్తున్నామని తెలిపారు. చనిపోయిన కార్మికులకు రూ.20 లక్షలు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్మికుల సమస్యల సాధనకు జైలుకు వెళ్లారు, అప్పుడు కార్మికులకు రూ.లక్ష ఇవ్వమన్నా ఇవ్వలేదన్నారు. కార్మికుల ఇండ్లకు ఉచిత కరెంటు ఇప్పించామని పేర్కొన్నారు. ఏసీ పెట్టే అవకాశాన్ని కల్పించాం, సొంతింటి కోసం రూ.10 లక్షలు వడ్డీలేని రుణం అందించామన్నారు. సింగరేణి కార్మికుల అనేక సమస్యలు పరిష్కరించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభు త్వానికే దక్కిందన్నారు. వీటన్నింటిని గమ నించి రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎంపీ అ భ్యర్థి బోర్లకుంట వెంకటేశ్‌నేతను గెలిపించాలని కోరారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పాల్గొన్నారు.
ఈ ప్రాంత బిడ్డగా ఆశీర్వదించాలి
– బోర్లకుంట వెంకటేశ్, ఎంపీ అభ్యర్థి
రైతు కుటుంబంలో పుట్టాను. ఈ ప్రాంత బిడ్డగా నన్ను ఆశీర్వదించాలి. మీ అందరి స మస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా. రెండు చేతులెత్తి నమస్కరి స్తున్నా. మీ ఆశీర్వాదాలు అందించి కారుగుర్తుకు ఓటు వేసి దీవించాలి.
Comments
Please login to add a commentAdd a comment