సర్వేశ్వరరావుకు కండువా వేసి టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు(ఫైల్)
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వింత పోకడలు పోతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టిన టీడీపీ సర్కారు మరోసారి అలాంటి పనే చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు అసెంబ్లీలో విప్ పదవి కట్టబెట్టింది. ఆయనతో పాటు విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే గణబాబును విప్‌గా నియమించింది. శాసనమండలిలో విప్‌లుగా బుద్ధా వెంకన్న, ఎంఎ షరీఫ్, రామసుబ్బారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
పార్టీ ఫిరాయించిన సర్వేశ్వరరావుకు విప్ పదవి ఇవ్వడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు తీరును న్యాయ నిపుణులు తప్పుబడుతున్నారు. విపక్ష ఎమ్మెల్యేకు ప్రభుత్వంలో పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ విమర్శించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినట్టు గుర్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment