
సాక్షి, భువనగిరి(యాదాద్రి): బడుగు బలహీన వర్గాలను, రైతులను మోసం చేసిన కాంగ్రెస్ బాటలోనే టీఆర్‌ఎస్ పనిచేస్తుందని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మార్పు కోసం బీజేపీ జనచైతన్య యాత్ర కార్యక్రమంలో బాగంగా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ మతోన్మాద పార్టీ ఎంఐఎంను పోషిస్తోందని అన్నారు. ఎంఐఎం నేతలు కనిపిస్తే టీఆర్‌ఎస్ నేతలు వంగి వంగి సలామ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు అన్ని పార్టీలకు ఓటు వేశారు.. ఇప్పుడు బీజేపీకి ఓటువేసి మార్పు తీసుకురండని ప్రజలని కిషన్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగానే ఎమ్మెల్సీ రామచందర్ రావు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణాను అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. కేసీఆర్ కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment