సాక్షి, హైదరాబాద్ : వంద సీట్లతో అధికారం చేపట్టబోయేది టీఆర్‌ఎస్ పార్టేనని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా టీఆర్‌ఎస్ గెలుపు కోసం అహర్నీషులు కష్టపడ్డ పార్టీనేతలు.. లక్షలాది మంది కార్యకర్తలకు ఆయన ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ నాయకులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ప్రకారం సుమారు 100 సీట్లతో టీఆర్‌ఎస్ అధికారం చేపట్టబోతుందనే విశ్వాసం తనకుందని పేర్కొన్నారు. మరోవైపు జాతీయ చానెల్స్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టగా.. కాంగ్రెస్ మాజీ నేత లగడపాటి రాజగోపాల్ మాత్రం కూటమిదే అధికారమని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏది ఏమైనప్పటికి అధికారం ఎవరిదో తెలియాలంటే డిసెంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే. (చదవండి: లగడపాటి సర్వే: ప్రజాఫ్రంట్‌దే అధికారం !)
Wholehearted thanks to the lakhs of TRS leaders & workers who’ve toiled very hard over the last 3 months🙏 👏🙏
— KTR (@KTRTRS) December 7, 2018
With the feedback of our leaders from different districts, I am confident that TRS will form the Govt with nearly hundred seats 👍
Jai Telangana 😊
Comments
Please login to add a commentAdd a comment