lagadapati Raj gopal
-
వికటించిన రాజకీయ కుట్ర!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పెద్ద కుట్ర పూర్తిగా వికటించింది. నలభయ్యేళ్ల ఇండస్ట్రీ అనికాలర్ ఎగరేసే ఓ నేత, ఏ ఎండకా గొడుగు పట్టే ఒక మీడియా సంస్థ అధినేత రాజకీయం–ఇండస్ట్రీల అవకాశవాద కలబోత ముసుగులో ఆడిన నాటకం రక్తికట్టకపోగా అసలుకే ఎసరు తెచ్చింది. ఆశించిన ఫలితమేదీ నెరవేర్చకపోగా మిణుకుమిణుకుమంటున్న వారి విశ్వసనీయతకూ పెద్ద గండికొట్టింది. తామొకటి తలిస్తే జనమొకటి తలచె అన్నట్లు ప్రజాతీర్పు వారి కుయుక్తులను చిత్తు చేసింది. బెట్టింగ్ ప్రపంచంలో ఎందరినో బోల్తా కొట్టించిన వారి ‘ఎత్తుగడ పార్ట్–2’ చివరకు చీకట్లో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారడం వరకే పరిమితమైంది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ‘ఫలానా సర్వే ఏమైంది?, ఫలితం ఎందుకిలా భిన్నంగా వచ్చింది?, విపక్షాలు మరీ ఇంత ఘోరమా?’ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాన్యుల్లో ఎన్నో ప్రశ్నలు, ఎడతెగని సందేహాలు! దీనికి సమాధానం తెలియాలంటే వెనక్కి తిరిగి కాస్త లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలే వెలుగుచూస్తాయి. ఎగ్జిట్ పోల్ భ్రమ కల్పిస్తూ, సర్వే అని బుకాయిస్తూ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన ఎన్నికల ఫలితాలపై అంచనాలొక పెద్ద రాజకీయ వ్యూహం! నాన్చి నాన్చి నాడు ఈ అంచనాలను వెల్లడించడం వెనుక రాజకీయ ‘ఒత్తిళ్లు’ పనిచేసినట్లు ప్రచారం జరిగింది. ఆ గణాంకాలకు, ఇప్పు డు వెల్లడైన ఫలితాలకు పొంతన లేకపోవడాన్ని అన్వయించినప్పుడు నాటి ప్రచారం నిజమేనేమో అనిపిస్తుంది! ఇక రాబోయే ఎన్నికల్లో జనం ఇటువంటి ఎత్తుగడల్ని ముందే ‘ఛీ’కొట్టనున్నారు. అది రేపు జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలైనా, లోక్‌సభకు జరిగే సాధారణ ఎన్నికలైనా వారిది ఇదే పరిస్థితి! ‘ఇక ఆక్టోపస్ పని ఔట్!’ అన్నది ప్రస్తుత జనవాణి. గెలుపును చిన్నబుచ్చే యత్నం... రెండోసారి అంచనాలు వెల్లడించినప్పుడు ప్రజాకూటమికి 65 స్థానాలు వస్తాయని, పాలక టీఆర్ఎస్కు 35 స్థానాలు వస్తాయని ‘సర్వే’క్షకుడు వెల్లడించారు. దానికితోడు ఓ అశాస్త్రీయమైన ఎర్రర్ మార్జిన్ ప్రకటించారు. పనిలో పనిగా ముందే ఓ రాయి వేసి ప్రత్యర్థి గెలిస్తే ఆ గెలుపును చిన్నది చేసి చూపే ప్రయ త్నం ప్రారంభించారు. తాము ఆశిస్తున్నట్టు పాలకపక్షం ఓడిపోయి, కూటమి గెలిస్తే సరేసరి! ‘ఆక్టోపస్ మళ్లీ సక్సెస్!’ అని బాకా ఊదుకోవచ్చు! కూటమే ఓడి, పాలకపక్షం తిరిగి గెలిస్తే.. ఏదో ఒక సాకు ముం దే సిద్ధం చేసుకున్నట్టు, ‘ఈసారి పోలింగ్‌ను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి, డబ్బు–మద్యం–ఇంకా ఇంకా... ఏవేవో ప్రభావలుండటం వల్ల పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతోంది, అంచనా వేయడం మాకు కష్టమవుతోంది’ అని చెప్పడం వెను క ఉద్దేశం ఇదే! ఏ సర్వే అయినా, ఏ ఎగ్జిట్ పోల్ అయినా, ఎవరు ఎటు వేస్తున్నారు/వేయనున్నారు/వేశారు అన్నదే చూస్తారు తప్ప కారణాలు వెతికి, అంచనా తమకు చాలా కష్టంగా ఉందని ‘దీనాలాప న’ చేయరు! కానీ ఇక్కడ అదే చేశారు. ‘వీరు గెలిచే మరికొందరు స్వతంత్రుల’ని కొన్ని పేర్లు చెప్పి, ‘ఇంకొన్నిటి సమాచారం కూడా ఉంది కానీ అక్కడ నా మిత్రులు పోటీ చేస్తున్నారు కనుక అవి చాలా సున్నితమైనవి, నేను పేర్లు వెల్లడించను’ అని తన పక్షపాత ధోరణిని ఆయనే బయటపెట్టారు. ఇవి కల్లబొల్లి కబుర్లని తెలిసీ పతాక శీర్షికలు చేసి/బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి సాను‘కుల’ మీడియా తరించిం దని ప్రత్యర్థి రాజకీయపక్షాల వారు విమర్శించింది కూడా ఇందుకే! ఇదంతా ఓ విశాల కుట్రలో భాగమ ని సాధారణ పరిశీలకులకు కూడా స్పష్టమైంది. ఎందుకీ తెగింపు? ఏది చేసినా నిర్దిష్ట ప్రయోజనాలు ఆశించే చేస్తారని ఎప్పట్నుంచో ఈ సర్వేల పెద్దమనిషికి పేరు. కాకతా ళీయంగానో, యాదృచ్ఛికంగానో 4 సార్లు నంబర్లు కలవగానే.... ఓ గొప్ప సెఫాలజిస్టని, రాజకీయ/ఎన్నికల ఫలితాల విశ్లేషకుడనే పేరు ప్రచారంలోకి వచ్చింది. తుది ఫలితాలకు దగ్గరగా ఉన్నపుడు ‘అబ్బో! అచ్చుగుద్దినట్టొచ్చింద’ని విస్తృత ప్రచారం చేసే సాను‘కుల’ మీడియా, నంబర్లు తేడా వచ్చినప్పుడు మాత్రం కిమ్మనదు. తప్పుడు విశ్వసనీయతను ముసుగు కప్పి మరీ కాపాడుతుంది. ఎప్పుడో మళ్లీ అవసరానికి పనికొస్తారు కదా అన్నది ఉమ్మడి ప్రయోజనం కావొ చ్చు! ఈ ఎన్నికల్లో కుట్రదారులు రెండంచెల నాటకమాడారు. ప్రజాక్షేత్రంలో అయోమయం సృష్టించి కూటమికి జవసత్వాలివ్వడం ఒకటైతే... బెట్టింగ్‌లకు ఆస్కారం పెంచడం రెండోది. సోదిలో కూడా లేని కూటమి దూసుకొస్తోందని, గెలుపు దిశగా పరుగెడుతోందని తప్పుడు రాతలు రాసిన అదే సాను‘కుల’ మీడియా ఈ చిలక జోస్యాలకు విస్తృత ప్రచారం కల్పించి వేదిక సిద్ధం చేస్తుంది. ఇప్పుడూ అదే జరిగింది. ‘ఈ ఎన్నికల్లో 10 మంది వరకు స్వ తంత్రులు గెలుస్తారు, ఇదుగో ఈ ఇద్దరివి పేర్లు...’ అని తిరుపతిలో ఆ పెద్దమనిషి వెల్లడించినది టీజర్! ఆ ఇద్దరూ అడ్రస్ లేకుండా పోయారు. నారాయణపేటలో కె.శివకుమార్‌రెడ్డి 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోగా బోథ్‌లో అనిల్‌జాదవ్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక మిగతా ఇండిపెండెంట్ల పరిస్థితి అంతే సంగతి! అంచనాల పేరిట కూటమికి సత్తువ తెచ్చే ఈ కుట్రకు తెరలేచింది మాత్రం మీడియా పెద్ద మనిషి, రాజకీయ నేతతో సదరు ‘సర్వే’క్షకుడి భోజన భేటీలో అన్నది ప్రచారం. ఇక తమ అంచనాల పార్ట్–2 నాటకం, తెలంగాణలో పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రం 7 గంటలకు జరిగింది. ఆ సమయంలో విలేకరుల సమావేశమనగానే ఎవరైనా ‘ఎగ్జిట్ పోల్’ వివరాలు వెల్లడిస్తారేమో అనుకుంటారు. ఎగ్జిట్ పోల్ కాదని స్పష్టం చేసిన ఆయన... తాము సర్వే కూడా ఏమీ నిర్వహించలేదనీ ప్రకటించారు. ఎందుకిలా అంకెలు తరచూ మారుతున్నాయి? అని అడిగితే ‘మా వాళ్లు ఫీల్డులో ఉన్నారు, ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇస్తున్నారు...’ అని చెప్పుకొచ్చారు. -
ప్రభుత్వం ఏర్పాటు చేసేది టీఆర్ఎస్సే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : వంద సీట్లతో అధికారం చేపట్టబోయేది టీఆర్ఎస్ పార్టేనని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా టీఆర్ఎస్ గెలుపు కోసం అహర్నీషులు కష్టపడ్డ పార్టీనేతలు.. లక్షలాది మంది కార్యకర్తలకు ఆయన ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ నాయకులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ప్రకారం సుమారు 100 సీట్లతో టీఆర్ఎస్ అధికారం చేపట్టబోతుందనే విశ్వాసం తనకుందని పేర్కొన్నారు. మరోవైపు జాతీయ చానెల్స్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్కు పట్టం కట్టగా.. కాంగ్రెస్ మాజీ నేత లగడపాటి రాజగోపాల్ మాత్రం కూటమిదే అధికారమని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏది ఏమైనప్పటికి అధికారం ఎవరిదో తెలియాలంటే డిసెంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే. (చదవండి: లగడపాటి సర్వే: ప్రజాఫ్రంట్‌దే అధికారం !) Wholehearted thanks to the lakhs of TRS leaders & workers who’ve toiled very hard over the last 3 months🙏 👏🙏 With the feedback of our leaders from different districts, I am confident that TRS will form the Govt with nearly hundred seats 👍 Jai Telangana 😊 — KTR (@KTRTRS) December 7, 2018 -
లగడపాటి సర్వే: ప్రజాఫ్రంట్‌దే అధికారం !
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో అధికారం చేపట్టబోయేది కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాఫ్రంటేనని ఆ పార్టీ మాజీ నేత లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. గతంలో ప్రకటించిన విధంగా ఆయన ఎన్నికల అనంతరం తన సర్వే వివరాలను వెల్లడించారు. ఓవైపు జాతీయ చానెల్స్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కేసీఆర్‌కు పట్టం కట్టగా.. లగడపాటి మాత్రం కూటమిదే అధికారమని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు 8 నుంచి 10 మంది అభ్యర్థులు గెలుస్తారని, పోలింగ్ శాతం తగ్గితే హంగ్ వస్తుందని బాంబు పేల్చిన లగడపాటి.. ప్రజలనాడీ హస్తం వైపే ఉందని హింట్ ఇచ్చారు. ఇండిపెండెంట్లు ఏడుగురు... తమ ఆర్జీ ఫ్లాష్ టీం సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు అనేక పర్యాయాలు ప్రజల నాడి, మనోభావాలు, వారు ఎటువైపు మొగ్గుచూపుతున్నారనే అంశాలపై సర్వే చేసిందని వెల్లడించారు. గత ఎన్నికల్లో 68.5 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ రోజు తెలంగాణలో 72 శాతం పోలింగ్ నమోదైనట్టు తమకు ఓ అంచనా ఉందని, రాత్రి 9గంటలకు పూర్తి పోలింగ్ నమోదు శాతం వచ్చే అవకాశం ఉందన్నారు. అధిక శాతం పోలింగ్ ఈసారి నమోదైందని చెప్పారు. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఖర్చు పెట్టారని, ప్రలోభాలకు గురిచేశారన్నారు. ఈ నేపథ్యంలో తను ముందుగా చెప్పినట్లు.. 8-10 మంది ఇండిపెండెట్లలో ఏడుగురు గెలుస్తారన్నారు. ఈ సంఖ్యకు రెండు పెరగవచ్చు.. రెండు తగ్గవచ్చని కూడా చెప్పారు. ఫ్రంట్ 55-75.. టీఆర్ఎస్ 25-45.. లగడపాటి లెక్క ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్ 55 నుంచి75 సీట్లు గెలుస్తందన్నారు. టీఆర్ఎస్కు కేవలం 25- 45 మాత్రమే వస్తాయన్నారు. కూటమిలో భాగంగా 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీకి 5-9 సీట్లు వస్తాయని, బీజేపీకి 5-9, ఎంఐఎం 6-7, ఇతరులు 5-9 సీట్లు గెలుస్తారని జోస్యం చెప్పారు. బీఎల్ఎఫ్ కూడా ఖమ్మంలో ఒక సీటు గెలిచే అవకాశం ఉందన్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్స్ అన్నీ తప్పయ్యాయని, కానీ తాను చెప్పిన జోస్యం నిజమైందని గుర్తు చేశారు. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్.. లగడపాటి సర్వే ఫలితాల్లో ఏవి నిజమో తెలియాలంటే.. ఫలితాలు వెలువడే డిసెంబర్ 11 వరకు వేచిచూడాల్సిందే. -
టీఆర్ఎస్దే పైచేయి .. ఇండియా టుడే తాజా సర్వే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత వాతావరణం, ప్రజానాడి హస్తానికే మొగ్గు ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత లగడపాటి రాజగోపాల్ పేర్కొనగా.. మరోవైపు ఇండియాటుడే తాజా సర్వే మాత్రం టీఆర్ఎస్ పార్టే పై చేయి సాధిస్తుందని స్పష్టం చేసింది. మరో రెండు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో ఈ సర్వేలు సర్వత్రా ఆసక్తిరేపుతున్నాయి. లగడపాటి సర్వేకు భిన్నంగా ఇండియా టుడే తాజా సర్వేలో టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యత లభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇండియా టుడే పొలిటికల్ ఎక్స్ఛేంజ్.. 17 పార్లమెంట్ నియోజవర్గాల్లో టెలిఫొనిక్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో టీఆర్ఎస్కు గత నెలకన్నా 4 శాతం మద్దతు పెరిగినట్లు వెల్లడైందని ప్రకటించింది. గత నెలలో 44 శాతం మంది టీఆర్ఎస్కు మద్దతు నిలవగా.. ప్రస్తుతం 48 శాతం మద్దుతు పలుకుతున్నట్లు తమ సర్వేలో స్పష్టమైందని పేర్కొంది. ఇక ప్రభుత్వం మారాలనే వారి సంఖ్య కూడా 4 శాతం పెరిగందని, గత నెలలో 34 శాతం మంది ప్రభుత్వ మార్పును కోరగా.. ప్రస్తుతం ఆ మద్దతు 38 శాతం పెరిగిందన్నారు. ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉండగా.. దక్షిణ తెలంగాణలో కూటమికి అనుకూలంగా ఉందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. రైతు బంధు, రైతు భీమా, కల్యాణ లక్ష్మీలపై ప్రజల్లో ఆధారణ ఉందని, ఇది టీఆర్ఎస్కు కలిసొచ్చే అంశమని పేర్కొంది. నగరంలో ఎంఐఎం మద్దతు కూడా కలిసిసొస్తుందని, మురికి వాడల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని తమ సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గంలో టెలిఫొనిక్ ఇంటర్వ్యూ ద్వారా 6,887 శాంపుల్స్ తీసుకున్నట్లు తెలిపింది. -
రాజీనామాలపై ఊగిసలాట!
* నేడు ఐదుగురు ఎంపీలం స్పీకర్‌ను కలిసి ‘ఆమోదం’ కోరతాం: అనంత * సీఎంతో భేటీ అనంతరం రాజీనామాలపై కొందరు ఎంపీల డైలమా! సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చుకొనే అవకాశాలు కనిపించకపోవటంతో పార్లమెంట్ సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని తనతో సహా సీమాంధ్రకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించుకున్నట్లు అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తనతో పాటు ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఎ.సాయిప్రతాప్‌లు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ను కలసి.. గతంలో తాము సమర్పించిన రాజీనామాలను ఆమోదించాలని కోరతామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించేందుకు తన వంతు కషిచేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా పలువురు కేంద్ర, రాష్ట్ర నాయకులు తొందరపడవద్దని సలహా ఇస్తున్నప్పటికీ ఎవరి ఒత్తిడికి లొంగరాదనే తాము ఐదుగురం నిర్ణయించుకున్నామని అనంత పేర్కొన్నారు. అయితే.. సోమవారం ఢిల్లీలోనే ఉన్న సీఎం పలువురు ఎంపీలతో మాట్లాడటం, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఈ భేటీలో పాల్గొనటం, రాజీనామాలు వద్దంటూ ఒత్తిడి తెస్తుండటంతో ఈ ఐదుగురు ఎంపీల్లోనూ కొందరు డైలమాలో పడ్డట్లు చెప్తున్నారు. ఎంపీలతో సీఎం, బొత్స మంగళవారం మధ్యాహ్న భోజన సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. -
బెజవాడలో లగడపాటిపై దాడికి యత్నం
విజయవాడ : విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు మరోసారి సమైక్య సెగ తగిలింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గత 33 రోజులుగా బెజవాడ ఆటోనగర్‌లో ఆటోమొబైల్ టెక్నికల్ సిబ్బంది చేస్తున్న సమైక్య దీక్ష శిబిరాన్ని సందర్శించిన సమయంలో ఉద్యమకారులు ఎంపీని నిలదీశారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ సందర్భంగా కార్మికులను అడ్డుకోవటంతో తోపులాట జరిగింది. దాంతో ఆగ్రహించిన కార్మికులు లగడపాటిపైకి దూసుకు పోయేందుకు యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. దాంతో లగడపాటిని అక్కడ నుంచి వెళ్లిపోవల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయినా లగడపాటి అక్కడ నుంచి కదలలేదు. అయినా ఆయన మాట్లాడేందుకు అవకాశం రాకపోవటంతో గంటపాటు కూర్చుని పోలీసుల సాయంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు కార్మికులు గాయపడ్డారు. -
విభజన ముందుకే సాగనట్లే: లగడపాటి
న్యూఢిల్లీ : విభజన ప్రక్రియ ముందుగు సాగదని కేంద్రం నుంచి హామీ వచ్చిందని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రావల్సి ఉందని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. సీమాంధ్ర ఎంపీల భేటీ అనంతరం లగడపాటి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ కమిటీపై మరింత సమాచారం సేకరిస్తామని ఆయన తెలిపారు. తమ భేటీలో పార్లమెంట్లో నిరసన తెలిపే అంశంపై చర్చించినట్లు లగడపాటి పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షల్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని లగడపాటి అన్నారు. గత నాలుగు నెలలుగా రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు పోరాడుతున్నామని ఆయన తెలిపారు. సీమాంధ్ర ఉద్యమం రగిలిన నేపథ్యంలో హైకమాండ్ ఎ.కె.ఆంటోని నేతృత్వంలోని హైలెవల్ కమిటీ నివేదిక వచ్చేదాకా విభజన ప్రక్రియను కొనసాగించేది లేదనే సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి పళ్ళం రాజు నిన్న సోనియాగాంధీతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధుల ముందు వెల్లడించడం విశేషం.