
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల తుది సమరంలో కారు జోరుగా దూసుకుపోతుంది. 91 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న టీఆర్‌ఎస్.. ఇప్పటికే జీవన్ రెడ్డిని ఓడగొట్టి.. ఖాతా తెరిచింది. టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమైన వేళ కేటీఆర్ ట్విట్టర్ ప్రెఫైల్ పిక్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. గన్ను గురిపెట్టి ఉన్న ఫోటోను కేటీఆర్ తన ట్విట్టర్ ప్రోఫైల్ పిక్‌గా పెట్టారు. ఈ ఫోటోను ఇప్పటికే 20 వేల మంది లైక్ చేయగా.. ‘కేటీఆర్ అన్న తుపాకీ గురి పెట్టాడు.. విజయం మనదే’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
#NewProfilePic pic.twitter.com/01pHEwHjZl
— KTR (@KTRTRS) December 10, 2018
కేటీఆర్ పోస్ట్ చేసిన ఈ ఫొటోపై ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ స్పందించారు. ‘ఈ ఒక్క ఫొటో చాలు బ్రదర్..ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి. శుభాకాంక్షలు’ అంటూ వెంకట్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కాగా ఈ ఫొటోపై దర్శకుడు హరీశ్ శంకర్ కూడా కామెంట్ చేశారు. ‘ఈ ఫొటో కాన్ఫిడెన్స్‌కు కొత్త అర్థం చెబుతోంది’ అని ట్వీట్ చేశారు. ఈరోజు ఉదయం ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్ దూసుకుపోతోంది. సిరిసిల్లలో కేటీఆర్ 20వేల ఆధిక్యంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment