
లెబనాన్ ప్రధానమంత్రి సాద్ హరిరి శనివారం అనూహ్యంగా రాజీనామా చేశారు. తనను హత్య చేస్తారేమోనన్న భయంతో ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఏడాది కిందటే ఆయన ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే, దేశంలో రాజకీయ వాతావరణం మారిపోవడంతోపాటు తన హత్యకు దారితీసే పరిస్థితులు నెలకొనడంతో ఆయన రాజీనామా చేశారు. అంతేకాకుండా లెబనాన్‌లో, మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఆధిపత్యం పెరిగిపోతుండటం కూడా ఆయన రాజీనామాకు కారణమని తెలుస్తోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆయన గతంలో పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.