ఠాక్రే ఎన్నికకు ముహూర్తం ఖరారు | Maharashtra MLC Elections On May 21 | Sakshi
Sakshi News home page

ఠాక్రే మండలి ఎన్నికకు ముహూర్తం ఖరారు

Published Fri, May 1 2020 2:23 PM | Last Updated on Fri, May 1 2020 2:23 PM

Maharashtra MLC Elections On May  21 - Sakshi

సాక్షి, ముంబై : మ‌హారాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మండలి ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ మేర‌కు మే 21న మ‌హారాష్ట్ర‌లో ఖాళీగా ఉన్న 9 శాస‌న‌మండ‌లి స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. అయితే, ఈ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా బారిన పడకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది. అంద‌రూ ముఖాల‌కు మాస్కులు ధ‌రించి, సామాజిక దూరం పాటిస్తూ పోలింగ్‌లో పాల్గొనాల‌ని ఈసీ పేర్కొంది. కాగా రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఈసీకి లేఖ రాసిన నేపథ్యంలో చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ సునీల్ అరోరా ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. (మండలి ఎన్నికలకు ఈసీ గ్రీన్ ‌సిగ్నల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement