సాక్షి, హైదరాబాద్: కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభ.. ఆ సభకు ముందే తెలంగాణ కేబినెట్ సమావేశం. కేబినెట్ భేటీలో అసెంబ్లీని రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు.. ఈ నేపథ్యంలో మంత్రి కే.తారకరామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు జరగబోయేది చివరి కేబినెట్ సమావేశం అని అనుకోవడం లేదని అన్నారు.
నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్ ఏం చేసిందనేది చెప్పడమే ప్రగతి నివేదన సభ ఉద్దేశమని చెప్పారు. సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తుండటంతో ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశానికి తాను, మంత్రి మహేందర్‌రెడ్డి హాజరుకావడం లేదని వెల్లడించారు. సభ విషయంలో ప్రతిపక్షాలు పనికిమాలిన విమర్శలు చేస్తున్నాయనీ.. ప్రతిపక్షాలు ముందుకు పోవడం లేదని, వెనక్కిపోతున్నాయని ఎద్దేవా చేశారు.
Published Sun, Sep 2 2018 1:14 PM | Last Updated on Sun, Sep 2 2018 1:47 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment