
సాక్షి, కర్నూలు : ప్రత్యేక హోదాపై తమ ఎంపీలు రాజీనామాలు చేసి పోరాడుతుంటే.. సీఎం చంద్రబాబు మాత్రం దొంగదీక్షలతో ప్రజలను మోసం చేస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర సోమవారం 2వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నందికొట్కూర్ నియోజకవర్గంలో సంఘీభావ పాద్రయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. రేపు మిడుతూర్ మండలంలోని కడమూరు నుంచి ప్రారంభమై పిరుసాహెబ్ పెట్ మీదుగా.. మండల కేంద్రం వరకు కొనసాగుతుందని.. అక్కడ జరిగే బహిరంగ సభతో సంఘీభావ పాదయాత్ర ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం 10కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందని తెలిపారు.
కేవలం ఓటుకు నోటుకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ఐజయ్య ఆరోపించారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజే ముద్దు అన్న బాబు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో యూ టర్న్ తీసుకుని.. దొంగ దీక్షలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. పాదయాత్రలో ప్రజ సమస్యలు తెలుసుకుంటాం.. చంద్రబాబు దొంగ దీక్షలను, రాష్ట్రంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎండగతామని ఐజయ్య హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment