MLA aijayya
-
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు
నందికొట్కూరు: అవకాశ వాద రాజకీయాలతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. శనివారం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 2014లో కాంగ్రెస్ పార్టీని తిట్టి బీజేపీతో దోస్తీ చేసి అధికారం చేపట్టిన చంద్రబాబు.. ఇప్పుడు బీజేపీని తిట్టి కాంగ్రెస్‌తో దోస్తీకి సిద్ధం కావడం చూస్తే ప్రపంచంలోనే ఆయనంత అవకాశవాద రాజకీయ నాయకుడు ఇంకొకరు ఉండరన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు నిమిత్తం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చలు జరిపేందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం జనాలకు తెలిసిపోయిందన్నారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప అధికారంలోకి రాలేనని చంద్రబాబుకు తెలిసిపోయిందన్నారు. అందుకే ప్రతిసారి ఎవరో ఒకరితో అంటకాగుతూనే ఉన్నారన్నారు. దమ్మూ ధైర్యం ఉంటే కేసీఆర్‌లాగా ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. వైఎస్సార్ చేసిన మేలు ముస్లింలు మరవరని, వారు ఎప్పుడూ వైఎస్సార్సీపీ వెంటే ఉంటారన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు అందరూ గమనిస్తున్నారన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేసేంత వరకు తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చేది లేదన్నారు. 22 కేసులున్న కోడెల శివప్రసాద్‌ను అసెంబ్లీ స్పీకర్ ఎలా చేశారని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. తంగడంచ ఫారం భూముల్లో పరిశ్రమలే స్థాపించలేదన్నారు. వేల కోట్లు దోచుకునేందుకే ప్రాజెక్ట్‌ల పేరుతో నాటకమాడుతున్నారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి 50 ఎకరాల తంగడంచ ఫారం భూములు కేటాయించాలని ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్‌కు పంపినా స్పందన లేదన్నారు. -
చంద్రబాబు దొంగదీక్షలను ఎండగడతాం : ఐజయ్య
సాక్షి, కర్నూలు : ప్రత్యేక హోదాపై తమ ఎంపీలు రాజీనామాలు చేసి పోరాడుతుంటే.. సీఎం చంద్రబాబు మాత్రం దొంగదీక్షలతో ప్రజలను మోసం చేస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర సోమవారం 2వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నందికొట్కూర్ నియోజకవర్గంలో సంఘీభావ పాద్రయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. రేపు మిడుతూర్ మండలంలోని కడమూరు నుంచి ప్రారంభమై పిరుసాహెబ్ పెట్ మీదుగా.. మండల కేంద్రం వరకు కొనసాగుతుందని.. అక్కడ జరిగే బహిరంగ సభతో సంఘీభావ పాదయాత్ర ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం 10కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందని తెలిపారు. కేవలం ఓటుకు నోటుకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ఐజయ్య ఆరోపించారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజే ముద్దు అన్న బాబు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో యూ టర్న్ తీసుకుని.. దొంగ దీక్షలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. పాదయాత్రలో ప్రజ సమస్యలు తెలుసుకుంటాం.. చంద్రబాబు దొంగ దీక్షలను, రాష్ట్రంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎండగతామని ఐజయ్య హెచ్చరించారు. -
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు లొంగిపోయారు
-
బాబు మోసాలు ఇక సాగవు
నందికొట్కూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసాలను జనం గమనిస్తున్నారని..ఇక ఆయన ఆటలు సాగవని వైఎస్ఆర్సీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. సోమవారం పట్టణంలోని ఆయన స్వగృహాంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న స్పందన చూసి సీఎంకు భయం పట్టుకుందన్నారు. ఆయన చేసిన మోసాలను రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెప్పి బాధపడుతున్నారన్నారు. వారంతా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై త్వరలోనే వేటు పడుతుందని, ఇప్పటికే వారిపై చర్యలు తీసుకోవాలని తమ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించిందన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ గుర్తుపై గెలవాలని సవాల్ విసిరారు. పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలుస్తానని మాయమాటలు చెప్పడం ఆయన మానుకోవాలని హితవు పలికారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల గెలుపుపై నమ్మకం లేకే సీఎం వారితో రాజీనామా చేయించడం లేదన్నారు. ఈ నెల 20వ తేదీన బేతంచర్లలో జరిగే వైఎస్ జగన్ బహిరంగ సభకు నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండలాల కన్వీనర్లు లక్ష్మీకాంతంరెడ్డి, రమాదేవి, లోకేష్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, నాయకులు నాగభూషణంరెడ్డి, వెంకటరెడ్డి, అయ్యపురెడ్డి, దివాకర్‌రెడ్డి, సాయి, చిట్టిరెడ్డి, ఏసన్న, తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ఫ్రీజోన్‌గా అమరావతి: సీఎం
- రాజధానిలో అందరికీ ఉద్యోగ అవకాశాలు - సీఎం చంద్రబాబు వెల్లడి - ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం జాతికి అంకితం సాక్షి ప్రతినిధి, కర్నూలు: అమరావతి ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాజధాని ప్రాంతం కావడంతో అందరికీ ఉద్యోగ అవకాశాలు లభించేందుకు వీలుగా త్వరలో ఫ్రీ జోన్ చేస్తామన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను కర్నూలు–కడప కాలువ (కేసీ కెనాల్)కు మళ్లించేందుకు ఉద్దేశించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని.. స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేయడం ద్వారా సోమవారం జాతికి అంకితం చేశారు. అనంతరం తడకనపల్లెలో నిర్వహించిన జన్మభూమి సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముచ్చుమర్రి చరిత్రలో నిలిచిపోతుందని, మార్చి నాటికి అన్ని పనులు పూర్తిచేసి, నాలుగు పంపుల ద్వారా నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ సమయంలో ప్రణాళిక వేసి చేపట్టిన ప్రాజెక్టులను తన హయాంలో పూర్తిచేసే భాగ్యం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. వ్యూహరచనలో తనను మించినవారు ఎవరూ లేరని కితాబునిచ్చుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రాలో కలపకపోతే ప్రమాణ స్వీకారం కూడా చేయనని ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రానికి తేల్చిచెప్పానన్నారు. తాను డిమాండ్ చేసినందుకే ఆ మండలాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్, చట్టం చేశారని చెప్పారు. కర్నూలును అభివృద్ధి చేయకూడదు కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కు ఏర్పాటు కానుందన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో తమ పార్టీకి కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయని, ఈ లెక్కన ఇక్కడ అభివృద్ధి చేయకూడదని, కానీ అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. (చదవండి :తమ్ముడూ... విను..నేను చెప్పేది విను..) కర్నూలు సభలో అనంత ఎంపీ జేసీ ఈ సభలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దర్శనమివ్వడమే కాకుండా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు కృతజ్ఞత చూపించాలని జేసీ అన్నారు. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ‘బాబు ఏమైనా గాంధీ మహాత్ముడా.. ఆయన సభకు జనం రావ డానికి’ అని జేసీ వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీని పిలిపించి సీఎం మాట్లాడించారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జేసీ మనస్సులో ఉన్నది మాట్లాడుతుంటారని, ఇది తనకు కూడా కొన్ని సందర్భాల్లో సమస్యలు తెచ్చిపెడుతుందన్నారు. ఏపీలో ప్రాజెక్టులు వైఎస్ భిక్షే: ఐజయ్య సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భిక్షేనని నందికొట్కూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య స్పష్టం చేశారు. తడకనపల్లెలో సోమవారం నిర్వహించిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడారు. ముచ్చుమర్రి ప్రాజెక్టుకు పునాది వేసింది వైఎస్సేనని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు పునాది వేసింది కూడా ఆయనేనని తెలిపారు. ఆ ప్రాజెక్టుల్నే ఇప్పుడు మీరు ప్రారంభిస్తున్నారని అన్నారు. పునాదులు వేసి పనులు చేసిన వాళ్లను విస్మరించడం సమంజసం కాదని అన్నారు. ఐజయ్య వైఎస్ పేరు ప్రస్తావించగానే సభలో పాల్గొన్న ప్రజలు ఈలలు, కేకలతో హర్షధ్వానాలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా తానే ప్రాజెక్టులు చేపట్టి ప్రారంభిస్తున్నానని, రాయలసీమను సైతం సస్యశ్యామలం చేశానని చెప్పుకుంటున్న సీఎం.. వైఎస్‌ను ఐజయ్య గుర్తుచేయడం, సభికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే రాజకీయాలు మాట్లాడవద్దంటూ ఎమ్మెల్యే మైక్‌ను కట్ చేయించారు. మైక్ లేకపోయినా ఐజయ్య మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు 2007లోనే రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. హంద్రీ–నీవా, ముచ్చుమర్రికి కలిపి రూ.120 కోట్లు కూడా కేటాయించారని చెప్పారు. ఆయన అకాల మరణంతో ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. సీఎం మాట్లాడుతూ.. ‘ఇప్పుడు నేను ఏమంటానంటే ఎన్టీఆర్‌గారు ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవన్నీ. ఆ ప్రాజెక్టులకు మళ్లీ నేనే వచ్చి ఇనాగరేషన్ చేశా. రాజకీయం చేయాలంటే.. కరెక్టు కాదు. కాలువలు ఉండవచ్చు. శివరామకృష్ణయ్య.. ఇప్పుడు దివాకర్రెడ్డిగారు చెప్పినట్లు ఎప్పుడో గీతలు గీశారు...’ అని చంద్రబాబు అన్నారు. ఎస్వీ మోహన్ రెడ్డి, భూమా నాగిరెడ్డిలు ఐజయ్య వద్ద ఉన్న మైక్‌ను తీసుకుని కూర్చోబెట్టారు. -
బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్
నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మిడుతూరు: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఆదివారం మండలపరిధిలోని వీపనగండ్ల గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. విగ్రహప్రదాత అయిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచ మేధావుల్లో బాబాసాహెబ్ ఒకరన్నారు. ఆయన కల్పించిన రిజర్వేషన్‌తో తాను ఐఆర్ఎస్ స్థాయికి ఎదిగానని చెప్పారు. జిల్లాలో 100కు పైగా అంబేడ్కర్ విగ్రహాలను సొంతఖర్చుతో నెలకొల్పి ఆయన గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేస్తానన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యుడు పర్వత యుగంధర్‌రెడ్డి, అంబేడ్కర్ యూత్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వాడాల త్యారాజు మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ నాగరాజు, పారిశ్రామిక వేత్త చంద్రమౌళి, దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాధవరం బాల సుందరం, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు జయరాముడు, మేకల దేవదాసు, జిల్లా అధ్యక్షుడు నాగముని, తాలుకా అధ్యక్షుడు అచ్చెన్న, టీడీపీ నాయకుడు విక్టర్, వీపనగండ్ల ఎంపీటీసీ తిమ్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖరయ్య, సంఘపెద్దలు పాల్గొన్నారు. -
కాపు కాచి హతమార్చారు
శ్రీశైలం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆసాది వసంతరావు(55) హత్యతో శ్రీశైలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతతకు మారుపేరైన ఈ ప్రాంతంలో ఓ వ్యక్తిని కాపు కాచి గొడ్డళ్లు, గడ్డపారలతో పొడిచి చంపడం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ రాష్ట్ర పరిధిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలివి.. వసంతరావు శుక్రవారం ఉదయం సున్నిపెంట నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ కారు(ఏపీ28 సీఎల్ 2830)లో బయలుదేరారు. 5.30 గంటల ప్రాంతంలో రెండో పవర్‌హౌస్ దాటి రెండు మలుపులు తిరగ్గానే ఎదురుగా వచ్చిన వాహనం వేగంగా ఢీకొంది. ఆ తర్వాత దుండగులు ఒక్కసారిగా వాహనాన్ని చుట్టుముట్టి వసంతరావును బయటకు లాగి గడ్డపార, గొడ్డళ్లతో దారుణంగా హత్య చేశారని కారు డ్రైవర్ శివ తెలిపారు. నిమిషాల వ్యవధిలో పరారైన దండగులు తమ వాహనాన్ని వజ్రాలగుట్ట సమీపంలో వదిలివెళ్లారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని మహబూబ్‌నగర్ జిల్లా ఆమ్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని శ్రీశైలం సీఐ వెంకటచక్రవర్తి, ఈగలపెంట ఎస్ఐ శ్రీనివాస్, ఆమ్రాబాద్ ఎస్ఐ ఆదిరెడ్డి పరిశీలించారు. కార్డు డ్రైవర్ ప్రమేయంపై పోలీసుల అనుమానం ఒక్కసారిగా చుట్టుముట్టిన దుండగులు కారు డ్రైవర్‌ను వదిలిపెట్టడం అనుమానాల కు తావిస్తోంది. ఆ దిశగా పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు 10 మంది వ్యక్తులు ముఖానికి కర్చీప్‌లు, టవళ్లు కట్టుకున్నారని.. కత్తులు, కొడవళ్లు, తుపాకులతో వచ్చిన వీరు వసంతరావు పక్కనే ఉన్న బ్రీఫ్‌కేస్‌లోని రూ.50వేలు తమకిచ్చి పారిపోవాలని చెప్పారని డ్రైవర్ శివ పోలీసులకు వివరించాడు. ఘటనకు ముందు లింగాలగట్టు ప్రాంతంలో ఓ దుకాణం వద్ద 15 నిమిషాలు కారు ఆపి సిగరెట్లు తీసుకున్నట్లు కూడా చెబుతున్నాడు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వసంతరావు రాకపోకలు డ్రైవర్‌తో పాటు ఆయన సన్నిహిత అనుచరుడు చెన్నయ్యకు మాత్రమే తెలుస్తుంది. ముందు రోజు రాత్రి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు వసంతరావు చెప్పారని చెబుతున్న శివ.. ఈ విషయం చెన్నయ్యకు కూడా తెలియదంటున్నాడు. అలాంటప్పుడు సమాచారం ప్రత్యర్థులకు ఎలా పొక్కిందనే ప్రశ్న తలెత్తుతోంది. గన్ లెసైన్స్ కోసం దరఖాస్తు? ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని గతంలో అప్పటి మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి దృష్టికి వసంతరావు తీసుకెళ్లగా.. ఆ మేరకు ఎస్పీకి అందజేసిన దరఖాస్తుపై ఆయన సిఫారసు కూడా చేసినట్లు తెలుస్తోంది. గన్మెన్లు కూడా కావాలని కోరగా.. భారం అధికమవుతుందని ఏరాసు సూచించడంతో లెసైన్స్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఏరాసు పాణ్యం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం.. వసంతరావు వైఎస్ఆర్సీపీలో చేరి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వెంట నడవటం జరిగింది. సున్నిపెంటతో పాటు శ్రీశైలంలోని ఎస్సీ వర్గీయులను ఏకతాటిపై నడిపించడంలో వసంతరావు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి నేత మరణంతో శ్రీశైలం మూగబోయింది. ముమ్మాటికీ రాజకీయ హత్యే - బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వసంతరావు హత్య రాజకీయంతో ముడిపడి ఉందని శ్రీశైలం నియోజకవర్గ ఎంఎల్ఏ, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. శ్రీశైలం మండల పరిధిలో హత్య జరిగితే ఆ నింద టీడీపీపైనే పడుతుందనే భావనతోనే ప్రత్యర్థులు తెలంగాణ రాష్ట్ర సరిహద్దును ఎంచుకున్నారన్నారు. హత్య వెనుక ఎవరున్నారో స్థానికులందరికీ తెలుసని, తెలంగాణ పోలీసులు కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలన్నారు. ఇటీవల వెన్నెముకకు ఆపరేషన్ చేయించుకున్న వసంతరావును అమానుషంగా దాడి చేసి హత్య చేయడం బాధాకరమన్నారు. హత్యా రాజకీయాలతో ఎదగాలనుకోవడం నీచమైన చర్యగా అభివర్ణించారు. కొన్ని నెలల క్రితమే సున్నిపెంటలో భూ ఆక్రమణలపై కలెక్టర్‌కు వసంతరావు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారని.. ఇది జీర్ణించుకోలేకనే హత్యకు పాల్పడ్డారన్నారు. హత్యా రాజకీయాలు సిగ్గుచేటు: ఎమ్మెల్యే ఐజయ్య మిడుతూరు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి పార్టీ నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా హత్యలు అధికమయ్యాయని నందికొట్కూరు ఎమ్మెల్యే వై.ఐజయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని 49 బన్నూరులో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వసంతరావును అధికార పార్టీ వర్గీయులే హత్య చేయించారన్నారు. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలతో సాంధిచేదేమీ ఉండదన్నారు.