పట్నా: ఎన్నికల వేళ రాజకీయ పార్టీల విమర్శలు సర్వసాధారణమే. కానీ ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ వ్యంగ్యంగా ఓ రైమ్‌ను రచించింది. ఎల్‌కేజీ, యూకేజీ చదువుతున్న పిల్లలు పాడుకునే జానీ.. జానీ ఎస్‌పాపా అనే ఐకానిక్ నర్సరీ రైమ్ అందరూ వినే ఉంటారు. అలాంటి రైమ్‌నే మోదీపై రచించారు. మోదీ మోదీ ఎస్‌పాపా అంటూ.. ఐదేళ్ల బీజేపీ పాలనను ఎండగడుతూ ఓ రైమ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘మోదీ మోదీ ఎస్‌పాపా.. ఫార్మర్ హ్యాపీ నో పాపా. ఉమెన్ సేఫ్టీ నో పాపా, 15 లక్షలు నోపాపా, అంటూ... రైమ్ ద్వారా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిని ఆర్జేడీ పార్టీ అధికార ట్విటర్ ఖాతాలో బుధవారం పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. కాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లో రాజకీయం ఉత్కంఠంగా మారిన విషయం తెలిసిందే. 40 లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రంలో విజయం కోసం ఓ వైపు బీజేపీ.. మరోవైపు కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి హోరాహోరీ పోటీపడుతున్నాయి.
आने वाले वक़्त में मोदी भक्तों के बच्चे यही कविता पढेंगे --------
— Rashtriya Janata Dal (@RJDforIndia) May 8, 2019
Modi modi
yes papa
Any development?
No papa
Farmer happy?
No papa
Women safe?
No papa
10 crore job?
No papa
15 lakhs??
No papa
Only jumla?
Ha😂 ha😂 ha 😂😂😂😂😂😂😂😂😂😂
Comments
Please login to add a commentAdd a comment