దల్తాన్‌గంజ్/సుకిందా: ప్రధాని నరేంద్ర మోదీ రోజూ 18 గంటలు పని చేస్తారని, గత 20 ఏళ్లలో ఆయన ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం ప్రతి రెండు నెలలకోసారి సెలవు తీసుకుంటా రని ఎద్దేవా చేశారు. శనివారం జార్ఖండ్, ఒడిశాల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ యూపీఏ హయాంలో ఉగ్రవాదం పేట్రేగిపోయిందని ఆరోపించారు.
సరిహద్దులో ఉగ్రవాదులు జవాను హేమ్‌రాజ్ శిరచ్ఛేదనం చేసిన ఘటన తాను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాన న్నారు. ఆ సమయంలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. కానీ ఇప్పుడు ఆ పరి స్థితి మారిందన్నారు. ‘మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు పాకిస్తాన్‌కు చెందిన ఆలియా, మాలియా, బాలియాలు (ఉగ్రవాదులనుద్దేశించి) దేశంలోకి తేలిగ్గా వచ్చి జవాన్లను శిరచ్ఛేదనం చేశారు’అని జార్ఖండ్‌లోని దల్తాన్ గంజ్‌లో జరిగిన ర్యాలీలో ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment