
సాక్షి, నిజామాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని మొత్తం 6 మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ స్పష్టమైన మెజారిటీ కనబర్చింది. బోధన్, ఆర్మూర్, భీంగల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ విజయం సాధించింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్‌లో 12 వార్డులకు 12 వార్డులను గెలిచి టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment