బీజేపీ కార్యకర్త అశోక్
మంగుళూరు, కర్ణాటక : సాధారణ ఎన్నికల ప్రచారం సందర్భంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 23 మంది కార్యకర్తలను అధికార కాంగ్రెస్ చంపించిందంటూ సంచలన ఆరోపణలు చేసింది. వారి పేర్లను బహిరంగ సభల్లో వినిపించింది కూడా. అయితే, మృతుల్లో ఒకరైన అశోక్ పూజరి జీవించే ఉన్నారు. ఈ మేరకు జాతీయ మీడియా కథనం ప్రచురించింది.
అశోక్ బజరంగ్ దళ్ కార్యకర్త. 2015లో మూడు మోటార్ సైకిల్స్‌పై వచ్చిన ఆరుగురు దుండగులు అశోక్‌ను తీవ్రంగా గాయపర్చారు. చావుబతుకులతో 15 రోజుల పాటు ఐసీయూలో పోరాడిన అశోక్ గట్టెక్కారు. ఎన్నికల ప్రచారంలో తన పేరు మృతుల లిస్టులో రావడంతో అశోక్ షాక్‌కు గురయ్యారు. వెంటనే బీజేపీ నాయకులను కలిశారు. పొరబాటున పేరు చేరిందని చెప్పారని, లిస్టు నుంచి పేరును తొలగిస్తామని చెప్పారని అశోకుడు వెల్లడించారు.
కానీ, ఆ తర్వాత బహిరంగ సమావేశాల్లో కూడా బీజేపీ 23 మంది కార్యకర్తలు మరణించారంటూ ప్రచారం చేస్తూనే ఉందని చెప్పారు. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ కూడా రెండు డజన్ల మంది కార్యకర్తలు కాంగ్రెస్ దాడుల్లో మరణించారని పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలపై స్పందించిన 23 మందిలో 14 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. దీనిపై స్పందించిన మంగుళూరు వీహెచ్‌పీ నాయకుడు జగదీశ్ షెనవా బీజేపీ తప్పుడు ప్రచారాలు చేయదని చెప్పారు. మృతుల లిస్టులో పేర్కొన్న వారందరూ కచ్చితంగా చనిపోయి ఉంటారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment