బీజేపీ ఖాతాలో 22వ రాష్ట్రం ! | Bjp To Form Government In 22nd State After Its Reached Magic Figure In Karnataka | Sakshi
Sakshi News home page

బీజేపీ ఖాతాలో 22వ రాష్ట్రం !

Published Tue, May 15 2018 11:43 AM | Last Updated on Fri, Mar 29 2019 5:33 PM

Bjp To Form Government In 22nd State After Its Reached Magic Figure In Karnataka - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ కర్ణాటక సీఎం అభ్యర్థి యడ్యూరప్పల జోడీ

సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటకలో బీజేపీ సాధారణ మెజారిటీ దిశగా సాగుతుండటంతో దేశంలోని 22వ రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఎన్నికలు జరిగిన 222 అసెంబ్లీ స్ధానాలకు గాను బీజేపీ 112 స్ధానాల్లో విస్పష్ట ఆధిక్యం కనబరచడంతో ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌కు చేరువైంది. తొలుత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీతో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు హోరాహోరీగా పోరాడినా కాంగ్రెస్‌ కేవలం 68 స్ధానాల్లోనే ఆధిక్యం కనబరచగా, జేడీఎస్‌ 40 స్ధానాలకే పరిమితమైంది.

కాగా కర్ణాటకలో పార్టీ ఘనవిజయం సాధించడంతో ఆ పార్టీ సీఎం అభ్యర్ధి యడ్యూరప్ప బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాకు ఫోన్‌ చేశారు. పార్టీ విజయంపై ఈ సందర్భంగా వారు ఇరువురూ పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం ‍పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మరోవైపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement