
సాక్షి, గుంటూరు: ప్రసంగంలో తత్తరపాటో లేక మనసు లోతుల్లో ఉన్న నిజం బయటకొచ్చిందో గానీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ మరో మారు నెటిజన్లకు దొరికిపోయాడు. ఇటీవల వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మంగళగిరిలో ప్రచారం చేస్తున్న నారా లోకేశ్ ఆదివారం రోడ్ షోలో మాట్లాడుతూ ‘పాపం వివేకానందరెడ్డి చనిపోయారు. ఆ విషయం తెలిసి పరవశించాం’ అన్నారు.
ఈ మాటలు విన్న తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదే తరహాలో యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం తెలిసో తెలియకో పెద్ద ఎత్తున కంపెనీలను అమరావతికి తీసుకొచ్చిందని లోకేశ్ అన్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.